Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆబ్సైట్ ఎమర్జెన్సీ సబ్ ప్లాన్ సమావేశంలో జేసీ
నవతెలంగాణ-అశ్వాపురం
భారజల కర్మాగార పరిసరాలలోని గ్రామాలకు పటిష్టమైన భద్రతను కల్పించాలని జాయింట్ కలెక్టర్ కే.వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గౌతమీ నగర్ కాలనీలో గల అతిథి గృహంలో నిర్వహించిన ఆప్ సైట్ ఎమర్జెన్సీ సబ్ ప్లాన్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత సేఫ్టీ మేనేజర్ జిఎస్ఎస్ విజె శర్మ కర్మాగారంకు చెందిన పలు భద్రతా విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అదేవిధంగా పరిసర గ్రామాలలో చేపడుతున్న భద్రతకు సంబంధించిన పలు అంశాలను వివరించారు. అనంతరం మండల పరిధిలోని అమ్మగారి పల్లి గ్రామంలో మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగిన సందర్భంలో హైడ్రోజన్ సల్ఫైడ్ వాయు విడుదలైనప్పుడు భద్రతాపరంగా యాజమాన్య వ్యవస్థల సమర్థత సదుపాయం నిర్వహణ ప్రతిస్పందన ప్రజలలో అవగాహన చేయడం కోసం కసరత్తును నిర్వహించారు. గ్యాస్ విడుదలైన సందర్భంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై కళ్లకు కట్టినట్టు వివరించారు. అనంతరం కాలనీలోని కాన్ఫరెన్స్ హాల్లో బారదల కర్మాగార ఉన్నతాధికారులు సమావేశమై పలు అంశాలను జాయింట్ కలెక్టర్కు వివరించారు. ఈ సమావేశంలో జిఎంకేవి తాలే, డీజీఎంలు ఐ.హరిప్రసాద్ ఎస్ జగ్గారావు, పీజేవీ సుధాకర్, సిఐఎస్ఎఫ్ కమాండెంట్ వినోత్ బాబు, సీఈఓ ఎస్వై కాంబ్లే, వైద్య అధికారి టి.విజరు కుమార్, అధికారులు జి.శ్రీనివాసరావు, పి.సతీష్, కృష్ణారెడ్డి, కే.తిరుమలరావు, కూనల్ లంబాటే స్థానిక మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.