Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
మండల పరిధిలోని మొద్దులగూడెం గ్రామంలో సీపీఐ(ఎం) నాయకులు అమరజీవి కామ్రేడ్ మోరంపూడి బాబురావు 22వ వర్ధంతిని పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డ లక్ష్మీనారాయణ అధ్యక్షతన మంగళవారం జరిగింది. మొట్టమొదట బాబురావు స్మారక స్థూపం వద్ద పార్టీ జెండాను సీనియర్ నాయకులు ఎండ్రాతి అప్పారావు ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో ఖమ్మం జిల్లా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావుచ ఖమ్మం జిల్లా యూటీఎఫ్ నాయకులు మోరంపూడి నిర్మల్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు దొడ్డ లక్ష్మీనారాయణ మాట్లాడారు. మోరంపూడి బాబురావు మహోత్తరమైన సిద్ధాంతాన్ని మార్గజాన్ని నమ్మి, పేద ప్రజలు, రైతులు, కార్మికులు వారి సమస్యలపై మిలిటెంట్ పోరాటాలు నిర్వహించారన్నారు. బాబు రావు ఆశయాలను సాధిస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలు అన్నింటిని ధ్వంసం చేసి ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని విమర్శించారు. ఈ సభలో మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు లింగారెడ్డి, శివశంకర్, సభ్యులు సిహెచ్ బ్రహ్మయ్య, కూచిపూడి రవి, ఎస్.కె నబి, ఎలఫోలు బిక్షం, గుండు రామమూర్తి, మోరంపూడి బాబురావు సన్నిహితులు దొడ్డ గాంధీ, పర్వతనేని ప్రభాకర్ రావు, దొడ్డ బాబురావు, తూముల వెంకటేశ్వరరావు, గ్రామస్తులు, బాబు రావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.