Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు రాష్ట్రంలో గుర్తింపు తెచ్చేందుకు మున్సిపల్ కమిషనర్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కమిషనర్ అంకుల్ షావలి నడుము కట్టారు. పరిశుభ్రత లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. గడిచిన 21 రోజులుగా ఇల్లందు పురపాలక సంఘం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టింది. అందులో భాగంగానే ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు విన్నూతనంగా పారిశుధ్య కార్మికుల దుస్తులు ధరించి రహదారులు, దుకాణాలు, హోటల్ల వద్దకు వెళ్లి తడి, పొడి చెత్త, కాలువలో పడ్డ చెత్తను సేకరించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సాహకారంతోనే ఇల్లందు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచగలుగుతామని తెలిపారు. పారిశుద్ధ్యానికి తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణ ప్రజలను ప్రతి ఒక్కరినీ నమస్కరించి వేడుకుంటున్నామని చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనంలోనే వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వాంకుడోత్ తార, గిన్నారపు రజిత, తోట లలిత శారద, సయ్యద్ ఆజం, వారా రవి, అంకె పాక నవీన్ కుమార్, ఆర్.శ్రీనివాస్, ఏఈ శంకర్, సానిటరీ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్లు, మున్సిపల్ సిబ్బంది మెప్మా సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.