Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టిఎస్ యుటియఫ్ ఆధ్వర్యంలో జీపు జాతా
నవతెలంగాణ-చింతకాని
స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపుమేరకు టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో సిపిఎస్ విధానం రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, నూతన విద్యా విధానం 2020 ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న జీపు యాత్ర మంగళవారం చింతకాని మండలంలో నాగులవంచ హైస్కూల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గా భవాని, జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, టిఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కే గీత నాగూర్ వలి, రాంబాబు, ఏ..కోటేశ్వరరావు, భీమ్ శంకర్, చింతకాని మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తోటకూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన జాతీయ విద్యా విధానం 2020 విద్యలో కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణ పెంచిపోషించేదిగా ఉందని టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు విమర్శించారు. మీనవోలు గ్రామ నందు టీఎస్ యుటిఎఫ్ ఆధ్వ ర్యంలో నూతన విద్యా విధానాన్ని కాంట్రి బ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం జీపుజాతను మండల పరిషత్ అధ్యక్షులు దేవరకొండ శిరీష, జడ్పిటిసి శీలం కవిత .జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాగురు వల్లి, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు అనుమోలు కోటేశ్వరావు, మండల అధ్యక్షులు బండారు నాగరాజు, మండల ఉపాధ్యక్షులు కంచర్ల శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు నీలం అజరుకుమార్, నండ్రు, వెంకటేశ్వరావు, రాజేష్, షాబిరా, శ్రీనివాస్, మధిర మండల బాధ్యులు కొండలరావు, భీమ శంకరం పాల్గొన్నారు.
కారేపల్లి : సామాజిక విలువల ప్రస్తావన లేని నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలని టీఎస్ యూటిఫ్ జిల్లా కార్యదర్శులు బానోత్ రాందాస్, డీ.ఎస్ నాగేశ్వర రావులు డిమాండ్ చేశారు. జాతీయ విద్యావిధానాన్ని, కాంట్రి బ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్లతో స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు టీఎస్ యూటిఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార జాత మంగళవారం కారేపల్లి మండలానికి చేరుకుంది. కారేపల్లి హైస్కూల్, మోడల్ స్కూల్,గేటుకారేపల్లి ఆశ్రమ పాఠశాలల్లో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.నాగేశ్వరరావు, బీ.మంగీలాల్, ఉపాధ్యక్షులు ఎన్.శిరీష, కోశాధికారి గంగాధర్, కార్యదర్శులు నాగలక్ష్మి, రామారావు, సూర్య, భాస్కర్, వీర్య, లకుతి, రమేష్, భీమా, సేవాజీ, నారాయణ, చంద్రయ్య, వసుధ,సుష్మిత, మోహన్ పాల్గొన్నారు.