Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిఎంఅండ్హెచ్ఓకి వినతి
నవతెలంగాణ- ఖమ్మం
ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణు, ఉపాధ్యక్షురాలు పిన్నింటి రమ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.మాలతికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, అప్పటి వరకు 10వేల రూపాయలు ఫిక్స్ వేతనం ఇవ్వాలని, ఈనెల 6 నుండి నిర్వహించే లెప్రసీ సర్వేకు అదనంగా డబ్బులు ఇవ్వాలన్నారు. 2023 జనవరి 18 నుండి నిర్వహించే కంటి వెలుగులకు పనికి అదనంగా డబ్బులు చెల్లించాలన్నారు. కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలయన్స్ నెలకు వెయ్యి రూపాయలు చొప్పున 16 నెలల డబ్బులు వెంటనే ఇవ్వాలని, జిల్లా ఆస్పత్రులలో ఆశాలకు రెస్టు రూమ్లు ఏర్పాటు చేయాలని, ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, గ్రామాల్లో పనిచేసిన ఆశా కార్యకర్తలకు ఇంచార్జ్ అలవెన్సు, ఆశాలకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అధికారుల వేధింపులు అరికట్టాలన్నారు. ఈ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఈనెల 15, 16 తేదీలలో 48 గంటల కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వంటావార్పు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా జిల్లా నాయకులు పి.రమణ, నిర్మల, శశిరేఖ తదితరులు పాల్గొన్నారు.