Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, మధిర మాజీ శాసన సభ్యులు కొండబాల కోటేశ్వరరావు సతీమణి రాజేశ్వరి అనారోగ్యం కారణంగా హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణిం చారు. రాజేశ్వరి భౌతికదేహాన్ని సోమవారం రాత్రి కొండబాల స్వగ్రామం కొందకుడిమకు తీసుకురాగా జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు మంగళవారం కొండకుడిమ చేరుకుని రాజేశ్వరికి నివాళులర్పించి కొండబాల కోటేశ్వరరావుకు సానుభూతి తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో వైరా ఎమ్మెల్యే లావుఢ్యా రాములు నాయక్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శనరావు, మధిర శాసన సభ్యులు మల్లు భట్టి విక్రమార్క, జడ్పి చైర్మన్ లింగాల కమలరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, భూక్యా వీరభద్రం, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డిసిఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, తెలుగుదేశం రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి రామనాథం, కూరపాటి వెంకటేశ్వర్లు, పోలీస్ గృహనిర్మాణ సంస్థ మాజీ చైర్మన్ పుతుంబాక కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, బి లక్ష్మి నారాయణ, మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, ఎంపీపీ వేల్పుల పావని, మునిసిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, జడ్పిటిసి నంబూరి కనకదుర్గ, కాంగ్రెస్ నాయకులు మాలోత్ రాందాస్ నాయక్, బానోతు బాలాజీ నాయక్, తాళ్లూరి జీవన్, తుంబూరు దయాకర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. బుదవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.