Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనారిటీ జిల్లా అధ్యక్షులు యాకూబ్ పాషా
నవతెలంగాణ-పాల్వంచ
కేంద్ర మైనారిటీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 2006 నుంచి అమలవుతున్న ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలను 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు రద్దు చెయ్యటం పట్ల ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో చర్చించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ అధ్యక్షులు యండి యాకూబ్ పాషా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పార్లమెంట్ సభ్యులను కోరారు. ప్రధాన మంత్రి నూతన 15 సూత్రాల పధకంలో భాగంగా దేశ వ్యాప్తంగా పేద మైనారిటీ విద్యార్థులకు ప్రతి యేటా 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించి విద్యార్థుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేయటం జరుగుతుందని, అందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం కూడా లక్షలాది మంది విద్యార్థులు ప్రి-మెట్రిక్ ఉపకార వేతనాలు పొందేందుకు విద్యార్థులు తమ వివరాలను ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు. కాని గత కొద్దీ రోజుల క్రితం విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం కేవలం 9వ,10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఇన్స్టిట్యూషన్ నోడల్ ఆఫీసర్, డిస్టిక్ నోడల్ ఆఫీసర్, స్టేట్ నోడల్ ఆఫీసర్ ధ్రువీకరించాలని స్కాలర్షిప్ పోర్టల్లో పేర్కొనడంతో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు నుండి చదువుతున్న విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం 2022-23 నుండి ఉపకార వేతనాలు పొందలేక నష్టపోతున్నారు. ఇట్టి విషయాన్ని పార్లమెంట్లో చర్చించి రద్దు చేస్తున్న ఉపకార వేతనాలను పునరిద్దించేలా చర్చ చెయ్యాలని కోరడం జరిగింది. విద్యా హక్కు చట్టంలో ఎక్కడ ఈ అంశం లేదని కేంద్రం వెంటనే ఈ విధానాన్ని ఉపసంహారించుకొని గతంలో మాదిరిగానే అన్ని తరగతుల వారికీ ఉపకార వేతనాలు అందేలా చుడాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని పార్లమెంట్ సభ్యులను కోరినట్లు తెలిపారు.