Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డైలీ వేజ్ వర్కర్ల యూనియన్లతో ఉన్నతాధికారులు సమావేశం
నవతెలంగాణ-భద్రాచలం
హైదరాబాదులోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో డైలీ వేజ్ వర్కర్ల యూనియన్లతో అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ సైదా డైలీ వేజ్ వర్కర్ల సమస్యలపై యూనియన్ల నాయకులతో బుధవారం జాయింట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు అనుబంధ తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ డైలీ వేజ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు తరఫున పాల్గొన్న యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి.మధు, రాష్ట్ర అధ్యక్షులు టేకెన్ ప్రభాకర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్, రాష్ట్ర కార్యదర్శులు కే.బ్రహ్మచారి, రాజేందర్, రాములు, కోటేశ్వరరావు, సంగ్యా నాయక్, పద్మ, హీరోలాల్, జలంధర్ తదితరులు అనేక విషయాలపై మాట్లాడారు. జీవో నెంబర్ 2012ను, జీవో నెంబర్ 16 ను సవరించాలని, ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్న డైలీ వేజ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26000 ఇవ్వాలి అవుట్సోర్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టకూడదని, చనిపోయిన కార్మికుల వారసులకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు.
పోస్టల్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టిన 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీని ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి డైలీ వేజ్ వర్కర్లకు వర్తింపజేయాలని, పార్ట్ టైం విధానం రద్దు చేయాలని, ప్రతి నెల మొదటి వారంలో జీతాలు ఇవ్వాలని, కార్మికుల సంఖ్యకు అనుగుణంగా కొత్త పోస్టులను మంజూరు చేయాలి, మంజూరు చేసిన పోస్టులలో ప్రస్తుతం పని చేస్తున్న వర్కర్లని పర్మినెంట్ చేయాలని, గుర్తింపు కార్డులు యూనిఫామ్ బట్టలు ఇవ్వాలన్నారు. జీవో నెంబర్ 212 పరిధిలో ఉన్న వర్కర్ల అందరికీ వెంటనే పర్మినెంట్ ఆర్డర్లు ఇవ్వాలని, ఈ సమస్యల పైన ప్రభుత్వానికి తెలియజేస్తామని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జాయింట్ సమావేశంలో పాల్గొన్న అధికారులు చెప్పారు. సమస్యల పరిష్కారం అయ్యేవరకు అన్ని సంఘాలు కలిసి ఐక్యంగా పోరాటం చేయాలని సీఐటియు అనుబంధ తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ డైలీ వేజ్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నది.