Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
దివ్యాంగులకు చేయూతనందించడం మన సామాజిక బాధ్యత అని ఎస్వోటు జీఎం లలిత్‌కుమార్ అన్నారు. బుధవారం సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో పివీ కాలనీ భద్రాద్రి స్టేడియం ఆవరణలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ అన్ని అవయవాలు సక్రమంగా వున్న మనుషులకు తీసిపోని విధంగా విధిరాత వల్ల అంగవైకల్యంతో పుట్టిన దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని జయిస్తూ వివిధ రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారన్నారు. అలాంటి వారికి చేయూతనందించడం మనందరి సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్కరూ వారి ఉజ్జ్వల భవిష్యత్తుకు బాసటగా నిలవాలి అన్నారు. స్థానిక దివ్యాంగులను ప్రోత్సహిం చేందుకుగాను వారికి క్రీడా, సాంస్కతిక పోటీలు నిర్వహించి వారికి జ్ఞాపికలు కూడా ఇవ్వడం ద్వారా వారిలో నూతనోత్సాహం, ఆత్మ విశ్వాసం పెంచడం జరుగుతుందన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా పాల్గొన్న ఏరియా సేవ అధ్యక్షురాలు జి.సునీత వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ... దివ్యాంగులు ఎంతో సున్నిత మనస్కులు వారి లోపాలను ఎత్తి చూపడం మానవత్వం అనిపించుకోదన్నారు. దివ్యాంగుల పట్ల తమ తల్లిదండ్రులు, సమాజం విపక్ష చూపకూడదన్నారు. ఈ కార్యక్రమంలో అనిత లలిత్ కుమార్, సింగు శ్రీనివాస్, రామేశ్వర రావు, సంక్షేమ అధికారి డి.నరేశ్, స్పోర్ట్స్ సూపర్వైజర్ జాన్‌వెస్లీ, వీరభద్రం, సేవ సెక్రటరీ షాకిర బేగం, సేవ సభ్యులు, పాల్గ్గొన్నారు.