Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
సీఆర్టిల సమస్యలపై డిప్యూటీ డైరెక్టర్‌తో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.కిషోర్ సింగ్ బుధవారం చర్చించారు. గత నాలుగు సంవత్సరాల క్రితం గిరిజన సంక్షేమ శాఖలో పనిచేయుచున్న సీఆర్టిలను ఐటిడిఏ అధికారులు తొలగించారు, అయితే టీఎస్ యుటిఎఫ్‌గా నాలుగు సంవత్సరాలుగా అనేక పోరాటాలు ప్రాతినిధ్యాలు చేయడం మూలంగా, ఆగస్టు నెలలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి సిఆర్టిల సంఘం రాతపూర్వకంగా ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు. వారి అభ్యర్థన మేరకు ఎమ్మెల్సీ గిరిజన సంక్షేమ శాఖ కమిషన్‌కి స్వయంగా లేఖ రాశారు. స్పందించిన కమిషనర్ ఐటీడీఏ అధికారులకు సిఆర్‌టిలను వెంటనే పునర్ నియమించాలని ఉత్తర్వులు ఇచ్చారని డిడి దృష్టికి వారు తీసుకొచ్చారు. అందుకే గత నెలలో టీఎస్ యుటిఎఫ్ ప్రాతినిధ్యం మేరకు 11 మందిని పునర్ నియామకము చేశారని, 36 మందిని కూడా పునర్ నియామకము చేయాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కమిటీ ప్రాతినిధ్యం మేరకు సెప్టెంబర్ నెలలో పిఓని కలిసి స్వయంగా ప్రాతినిధ్యం చేయడం మూలంగా నేడు 20 మందికి పోస్టింగ్స్ ఇప్పించాలని కోరినారు. ఇచ్చేదానికి డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి అంగీకరించి నట్లు తెలిపారు. మిగిలిన పండిట్లను కూడా నియామకాలు చేపట్టాలని అభ్యర్థించడం జరిగిందని,డిడి పది రోజుల్లో వారికి కూడా నియామకాలు చేపడతానని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు ఎస్.విజయకుమార్, మండల అధ్యక్షులు శ్రీనివాస్, సిఆర్టిలు బావ్ సింగ్, చరణ్, రవి, రవి మురళి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.