Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
జాతీయ సేవారత్న అవార్డ్ గ్రహీత అరుముళ్ల రాజుని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో బుధవారం సిఐటియు కార్యాలయంలో ఘనంగా శాలవాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు మాట్లాడుతూ గత నెల నవంబర్ 13, 14 వ తేదీలలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ చేతుల మీదగా జాతీయ సేవారత్న అవార్డ్ గ్రహీత అందుకున్నారని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా సమజాసేవలో ముందుకొస్తుంటాడని, తన ఆధ్వర్యంలో అనేక బ్లడ్ డొనేషన్, ఆర్గాన్ డొనేషన్, పేద విద్యార్థులను ప్రోత్సాహం చేసి వివిధ స్కాలర్షిప్ ల ద్వారా వాళ్ళను చదివిస్తున్నాడని, అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు నిరంతరం సేవ సామాజిక కార్యక్రమాలు తనకంటూ ఒక ముద్రవేసుకున్నారని పేర్కొన్నారు. కొత్తగూడెం ప్రధాన హాస్పిటల్ నందు వార్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడని ఇక్కడ కూడా పలు సేవలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అరుముళ్ల రాజు మాట్లాడుతూ నన్ను గుర్తించి సత్కరించటం చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే. రమేష్, బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు విజయగిరి శ్రీనివాస్, జి.రాజారావు, వై. వెంకటేశ్వరరావు, భూక్యా రమేష్, సూరం అయిలయ్య, కె. రమేష్ బాబు, కె. సమ్మయ్య, నాజర్, వార్డ్ అసిస్టెంట్లు కోట సంపత్ కుమార్,
మోహన్, వేణు తదితరులు పాల్గొన్నారు.