Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
ఎస్ఎఫ్ఐ అఖిలభారత మహాసభల జయప్రదంపై మాజీ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కాలంగి హరికృష్ణ బుధవారం రూ. 40 వేలు విరాళంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం చేస్తున్న పోరాటాలు నేడు ఎంతో అవసరమని ఈ మహాసభలు విజయవంతం కావాలని విద్యా రంగంలో వస్తున్న సవాళ్ళను ఎలా అధిగమించారు, శాస్త్రీయ ఆలోచనలు ఎలా రప్పించాలో చర్చించి గతం నుండి ఇప్పటివరకు జరిపిన పోరాటాలలో విద్యార్థి అమరవీరుల త్యాగాలను స్మరించుకునే దానికోసం ఉపయోగపడాలని అన్నారు.
1970లో కేరళ రాష్ట్రంలో అధ్యయనం పోరాటం-నినాదాలతో స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాలతో ఏర్పడి అనేక రకాల విద్యారంగా సమస్యల పరిష్కారం కోసం జరిగిన పోరాటాలలో ఒక ఛాంపియన్ ఆర్గనైజేషన్ లాగా ఎస్ఎఫ్ఐ ఉందని అన్నారు. 2004 నుండి 2020 వరకు ఎస్ఎఫ్ఐ నేర్పిన క్రమశిక్షణకు పోరాటపట్టినకు ఎప్పుడు రుణపడి ఉంటారని అందుకే ఎస్ఎఫ్ఐ మహాసభల జయప్రదం తన వంతు బాధ్యతగా రూ.40 వేలు ఇస్తున్నాని, అలాగే నాలాగా ఎస్ఎఫ్ఐ లో పనిచేసిన వారు కూడా మహాసభల జయప్రదనికి ఆర్థిక, హార్దిక సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు లిక్కి బాలరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి. వీరభద్రం, జిల్లా ఉపాధ్యక్షులు బి. అభిమన్యు కొట్టి నవీన్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.