Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం రీజినల్ మేనేజర్
నవతెలంగాణ-ఆళ్ళపల్లి (గుండాల)
ప్రజలకు నిత్యం సేవ చేస్తున్న ఆర్టీసీని ప్రజలు ఆదరించి, ముందుకు తీసుకెళ్లాలని ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏస్తారు ప్రభులత కోరారు. ఈ మేరకు బుధవారం గుండాల గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆర్టీసీ అనేక కష్టాలు కూర్చి ప్రజలకు సేవలు అందిస్తుందని కానీ, కాలానుగుణంగా ప్రజలు ఆర్టీసీని మర్చి, ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారని అన్నారు. రవాణా సౌకర్యం లేని సందర్భంలో సైతం ఆర్టీసీ ఎన్నో కష్టాలు పడి ప్రజలకు సేవలు అందించింది గుర్తు చేశారు. ఆక్యూపెన్సీ సరిపడా రాకున్నా సమస్త నష్టాల్లో ఉన్నా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని పనిచేస్తుందని తెలిపారు. గుండాల ప్రాంతానికి రోజు ఎనిమిది సర్వీసులు ఇల్లందు నుండి నడుపుతున్నామని తెలిపారు. ప్రజలు ఆర్టీసీని ఆదరించి, ప్రైవేటు వాహనాలను ఎక్కకుండా ఆర్టీసీలో ప్రయాణించే విధంగా చూడాలని కోరారు. అనంతరం స్థానిక ఎంపీపీ ముక్తి సత్యం మాట్లాడుతూ.. ఖమ్మం నుండి గుండాలకు ఎక్స్ ప్రెస్ సౌకర్యం, ఇల్లందు నుండి మేడారం బస్సు సౌకర్యం, కొత్తగూడెం నుండి గుండాలకు బస్సు సౌకర్యంతో పాటు గుండాల నుండి మహబూబాద్ బస్ సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే ఆళ్ళపల్లి నుండి ఇల్లందు బస్సు సౌకర్యం కల్పించాలని తెలిపారు. ఈ బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్టీసీ డీఎం బాణాల వెంకటేశ్వరరావు, ఆర్.ఎం ఆఫీస్ ఇంచార్జీ ఆర్.రామయ్య, సీఆర్ సీ శామ్యూల్, స్థానిక కోఆప్షన్ మెంబర్ షేక్ జావిద్, తదితరులు పాల్గొన్నారు.