Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయవంతం చేయండి - సీఐటీయూ
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు
నవతెలంగాణ-కొత్తగూడెం
బొగ్గు గని కార్మికుల 11వ వేతన సవరణ జాప్యానికి కార్మికులు నిరసన తెలిపాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఉదయం జికే-ఓసి పిట్ మీటింగ్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికుల వేతనాల పెంపుదల విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని, డిపిఈ గైడ్లైన్స్ ఆటంకంగా కుంటి సాకులు చెంబుతూ వేతన సవరణ చేయకుండా చేస్తుందని ఆరోపించారు. వేతన ఒప్పంద పరిష్కారానికై ఈ నెల దేశవ్యాప్తంగా 9వ తేదీన జరిగే ఆందోళన కార్యక్రమంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బ్రాంచి కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్, పిట్ కార్యదర్శి ఎలగొండ శ్రీరామ మూర్తి, భూక్యా రమేష్, కె.రమేష్ బాబు, ఎస్. సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.