Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలకు రక్షణ కల్పించడమే జిల్లా పోలీసుల ప్రధాన ధ్యేయం
- జిల్లా ఎస్పీ డాక్టర్.వినీత్.జి
నవతెలంగాణ-కొత్తగూడెం
లింగ వివక్షత రహిత సమాజాన్ని నిర్మించడం మన అందరి బాధ్యత అని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ డాక్టర్.వినీత్.జి అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం షీ టీం ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రకాశం స్టేడియం నుండి బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించిన లింగ వివక్షత రహిత ర్యాలీని ఆయన జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, పిల్లలు ఎదురుకుంటున్న లింగ అసమానత సమస్యపై లింగ వివక్షత రహిత సమాజాన్ని నిర్మించడం కోసం జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని చేపట్టి భారత దేశాన్ని అగ్రస్థాయిలో నిలబెట్టడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు. మహిళా సాధికారతకు, మహిళలు, పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడం కోసం, మహిళలపై జరిగే నేరాలను అదుపు చేయడానికి రాష్ట్ర పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ అధ్వర్యంలో అనేక చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రత్యేకంగా అక్రమ రవాణా, లైంగిక నేరాలు, గృహ హింస, బాల్య నేరాలు, సైబర్ నేరాలు వంటి సమస్యలకు నిర్దిష్ట పరిష్కారాలను అందించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు మహిళా భద్రతా విభాగం అధ్వర్యంలో 23 డిసెంబర్ 2022 వరకు పలు రకాల అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. లింగ వివక్షత నిర్మూలన, మహిళలు, పిల్లల భద్రతనే ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశమని, లింగ సమానత్వం అనేది స్త్రీ పోరాటం మాత్రమే కాదని మానవ పోరాటమని అన్నారు. మహిళలు స్వేచ్ఛగా అన్ని రంగాలలో రాణించే విధంగా ప్రతి ఒక్కరూ వారికి ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల వల్ల అన్నీ శాఖలతో పాటు పోలీస్ శాఖలో కుడా ఉద్యోగాలకు స్వేచ్ఛగా రాగలుగుతున్నరని తెలిపారు. ఇది ఎంతో శుభ పరిణామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం 1 టౌన్ సిఐ సత్యనారాయణ, 2 టౌన్ సిఐ రాజు,3 టౌన్ సిఐ అబ్బయ్య, సీడీపీఓ కనకదుర్గ, డీసీపీఓ హరి కుమారి,సఖి కో ఆర్డినేటర్ శుభశ్రీ, దిశ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాధవి, మై ఛాయస్ ఫౌండేషన్ నిర్వాహకురాలు సింధు, ఇంటర్నేషనల్ టైక్వాండో ప్లేయర్ సింధు తపస్వి, చైల్డ్ లైన్ మెంబెర్ రాజ్ కుమార్ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.