Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే హరిప్రియ
- ఉత్తమ మునిసిపాలిటీగా తీర్చిదిద్దుదాం
- ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-ఇల్లందు
తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తే పర్యావరణాన్ని కాపాడినట్టేనని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ తెలియజేశారు. స్వచ్ఛ సర్వేక్షన్-2023 కార్యక్రమంలో భాగంగా ఇల్లందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో తడి చెత్త పొడి చెత్త వేరు చేయుట విధానం, తడి చెత్త నుండి హౌమ్ కంపోస్ట్ తయారీ గురించి పట్టణంలోని మహిళలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం ఇల్లందు మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ మహిళలకు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇల్లందు పురపాల సంఘానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలో కూడా అవార్డు అందుకునే విధంగా శ్రమించాలని ఆదేశించారు. తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తే పర్యావరణాన్ని కాపాడినట్టే అని తెలియజేశారు. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అహర్నిశలు పాలకవర్గం శ్రమిస్తుందని ప్రతి ఒక్కరూ పురపాలక సంఘానికి సహకరించాలని కోరారు. సుస్థిర అభివృద్ధి కోసం చెత్తను వేరు చేయడం చాలా అవసరమని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్లో కలిసికట్టుగా శ్రమిద్దాం జాతీయస్థాయిలో ఉత్తమ మున్సిపాలిటీగా ఇల్లందు పట్టణాన్ని తీర్చిదిద్దుదామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయ పదంలో నడిపించిన మెప్మా, అంగన్వాడీ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ రవి, కమిషనర్ అంకు షావలి మాట్లాడుతూ తడి, చెత్త పొడి చెత్త వేరు చేస్తే కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ప్లాస్టిక్ వాడడం వల్ల కలిగే అనర్ధాలు గురించి మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ 24 వార్డుల కౌన్సిలర్లు, మున్సిపాలిటీ డీఈ రచ్చ రామకృష్ణ, ఏఈ శంకర్, ఆర్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.