Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఊపిరి పీల్చుకున్న పోలీసులు
నవతెలంగాణ-చర్ల
ఈ నెల రెండో తారీకు నుండి 8వ తారీకు వరకు జరిగిన మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు గురువారంతో ముగిసాయి. వారోత్సవాలు విజయవంతం చేయాలని మొదటి నుండి మావోయిస్టులు పెద్ద ఎత్తున లేఖల ద్వారా, పోస్టర్ల ద్వారా ప్రచారం చేశారు. సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లో మినహా తెలంగాణ సరిహద్దు చర్ల మండలంలో వారోత్సవాల ప్రభావం ఎక్కడ కనపడలేదు. సిఐ బి. అశోక్ నేతృత్వంలో పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ జిల్లా పోలీస్ యంత్రాంగం చర్ల పోలీసులు దండకారణ్యాన్ని జల్లెడబడుతూ అనుమానితులను అదుపులోకి తీసుకుంటూ మావోయిస్టు వారోత్సవాలను ఇంచుమించుగా అణచివేశారని చెప్పవచ్చు. నిత్యం కూబింగ్ నిర్వహిస్తూ మావోయిస్టు కొరియర్లను అదుపులోకి తీసుకొని మావోయిస్టు వారోత్సవాలని పోలీసులు విచ్ఛిన్నం చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రాంతాలకు వెళ్ళమని పోలీసులు సూచిస్తూ ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్సీ ద్వారా సమాచారం తీసుకుంటూ మావోయిస్టు వారోత్సవాలను నిలుపుదల చేశారు. ఇదిలా ఉంటే సరిహద్దు ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్‌లో పోలీస్ సర్వీస్ తుపాకీని తీసుకొని మావోయిస్టులు పరారయ్యారు. వోర్చా పోలీస్ స్టేషన్ పరిధిలో వోర్చా వారపుసంతలో సిఆర్పీఎఫ్ 16 బెటాలియన్ జవాన్ వెళ్లగా మావోయిస్టులు ఆ జవాన్ దగ్గర్నుండి ఒక ఎస్ఎల్ఆర్ రైఫిల్‌ను తీసుకెళ్లినట్టు తెలుస్తుంది.
ఒరిస్సాలో ఎదురు కాల్పులు ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి
నవతెలంగాణ-చెర్ల
పీఎల్‌జిఏ వారోత్సవాల ముగింపు రోజు మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఒరిస్సా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సా రాష్ట్రంలోని కొందమాల్ జిల్లా మటకుప అటవీ ప్రాంతం తాడికొల గ్రామ సమీపాన పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరపడంతో పాటు, గ్రనేడ్లతో దాడి చేశారు. పోలీసులు ఎదురు కాల్పులు జరుపగా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరు తప్పించుకున్నారు. ఈ మేరకు ఐజీ అమితాబ్ ఠాకూర్ వివరాలు వెల్లడించారు. మృతుల్లో ఒకరిని ఏసీఎం ర్యాంక్ కమలగా గుర్తించామని, మరొకరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.