Authorization
Wed March 26, 2025 08:57:46 am
- సామాజిక కార్యకర్త కర్నె రవి...
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు మున్సిపాలిటీని గ్రామపంచాయతీగా మార్చాలని సామాజిక కార్యకర్త కర్నె రవి అన్నారు. గురువారం మణుగూరు మున్సిపాలిటీ సమస్యపై గలమెత్తిన కర్నె రవి, మాజీ జడ్పిటిసి పాల్వంచ దుర్గ ఎనిమిది రోజు పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలాజీ నగర్, శ్రీశ్రీ నగర్లో ఇంటి పన్నులు ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నరన్నారు. ఈ ఏరియాలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్లే వర్షాకాలంలో ఇళ్ళులు మునిగి పోతున్నాయని ప్రజలు వాపోతున్నరన్నారు. బాలాజీ నగర్ లోని తహసీల్దార్ కార్యాలయం వెనుక వీధిలో నల్లా కనెక్షన్ ఇచ్చారు కానీ నీళ్ళు రావడం లేదని మహిళలు ఫిర్యాదు చేశారన్నారు. మణుగూరు మున్సిపాలిటీ అవడం వల్ల మాకు ఉపాధి హామీ పథకం లేకుండా పోయిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తంచేశారన్నారు. ఈ కార్యక్రమంలో బండి జగదీష్, కోయ్యడ.సాంబ, కారం.సీతరాములు, సంపత్,తదితరులు పాల్గొన్నారు.