Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప సర్పంచ్ మేడవరపు సుధీర్
నవతెలంగాణ-అశ్వాపురం
గత రెండు రోజులుగా నాపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమైనవని మొండికుంట పంచాయతీ ఉపసర్పంచ్ మేడవరపు సుధీర్ అన్నారు. గురువారం అశ్వాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు కావాలని నన్ను నా కుటుంబాన్ని సమాజంలో అభాసుపాలు చెయ్యాలనే దురుద్దేశంతోనే చేస్తున్నారన్నారు. మహిళల పట్ల తనకెంతో గౌరవం ఉందని, తల్లి, సోదరి భావం తోటే చూస్తాను తప్పా ఎక్కడ కూడా వారిని అగౌరవ పరచిన సందర్భం లేదన్నారు. నేను మహిళలకు ఇచ్చిన ఆ గౌరవమే ప్రస్తుతం నేను గ్రామ పంచాయితీలో బాధ్యతాయుతమైన పదవిలో వుండటానికి కారణమని తెలిపారు. కొంతమంది కావాలని ధనాపేక్షతో నాతో పాటు నా కుటుంబసభ్యులపై ఎన్ని తప్పుడు కేసులు, నాకు సంబంధం లేని కేసులు పెట్టినా కుట్రలు చేసినా చివరకు న్యాయమే గెలుస్తుందని న్యాయస్థానంపై నమ్మకముందని తెలిపారు. ఇకనైనా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని, నేనెలాంటి వాన్నో ప్రజలకు తెలుసన్నారు. నా కుటుంబసభ్యుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించొద్దని, ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయం పై ఉన్నతాధికారులను కలిసి విచారణ చేపట్టమని స్వయంగా కోరుతానని తెలిపారు.