Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమరుల స్పూర్తితో పోడుహక్కు పోరాటాలు : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-కారేపల్లి
పోడు సమస్య పరిష్కరించటంలో ప్రభుత్వ వైఫల్యంతోనే పోడులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కే.నరేంద్ర అన్నారు. కారేపల్లి మండలం చీమలపాడులో గురువారం ప్రజానాట్యమండలి కార్యదర్శి అమరజీవి రాచర్ల శ్రీనివాస్ 2వ వర్ధంతి జరిగింది. ఈసందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ పోడు జీవనంగా సాగిస్తున్న పేదలపై ఫారెస్టు నిర్భంధాలు విధిస్తుందన్నారు. ప్లాంటేషన్ కోసం పేదలు ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడును లాక్కొన్నారన్నారు. తమ జీవనాధారం పోయిందని ప్లాంటేషన్‌పై పోడు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. పేదలకు ఇస్తున్న పధకాలు మధ్య దళారుల పాలిట వరంగా మారుతున్నాయని విమర్శించారు. దళిత బంధు అంగడి సరుకుగా మార్చారని, పేదలకు పధకాలు అందక నిరాశకు గురవుతున్నారన్నాని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బంధును గ్రామసభ ద్వారా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రజానాట్యమండలి కళాకారుడు రాచర్ల శ్రీనివాస్ తన కళలతో పేదలతు ఉత్తేజపర్చి పోరాటాల్లో తీసుకవచ్చారని కొనియాడారు. ప్రజా పోరాటాలకు ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. రాచర్ల శ్రీనివాస్ స్తూపం వద్ద సీపీఐ(ఎం) జెండాను రాచర్ల మహాలక్ష్మి అవిష్కరించారు. ఈకార్యక్రమంలో నాయకులు వల్లబోయిన కొండలరావు, యనమనగండ్ల రవి, మన్యం బ్రహ్మయ్య, ఎరిపోతు భద్రయ్య, పోతురాజు చందర్రావు, కొండ వెంకటేశ్వర్లు, శేరు లలితమ్మ, గోకినపల్లి భరత లక్ష్మి, శేరు వెంకటేశ్వర్లు, హనుమ,వాంకుడోత్ రామకోటి తదితరులు పాల్గొన్నారు.