Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ
నవతెలంగాణ-కారేపల్లి
వ్యవసాయ కార్మికులకు సమగ్ర చేయటం ద్వారా న్యాయం జరుగుతుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ అన్నారు. గురువారం కారేపల్లిలో ప్రజాసంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం వజ్జా రామారావు అధ్యక్షతన జరిగింది. ఈసమావేశంలో మెరుగు సత్యనారాయణ మాట్లాడుతూ దేశం ఆహార కొరత తీర్చే రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర పాలకుల స్పందన సరిగా లేదన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతు ఉనికి ప్రశ్నార్ధం చేసే వ్యవసాయ చట్టాలను తీసుకరావటానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. రైతులు ఐక్యంగా తిప్పికొట్టిన వ్యవసాయరంగాన్ని కార్పొరేటీకరణకు అనేక మార్గాలు వెతుకుతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగం ఆధారంగా పేదలు జీవిస్తున్నారని వారికి భద్రత కరువైందన్నారు. వ్యవసాయ రంగం బాగుంటేనే కూలీలు బాగుంటారన్నారు. కూలీల సామాజిక భద్రతకు సమగ్ర శాసన చట్టం ఎంతో అవసరమన్నారు. కూలీలకు బంధు ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏజన్సీలో పోడు భూముల సమస్యను నాన్చకుండా ప్రభుత్వం పరిష్కార మార్గం చూపాలన్నారు. ఈనెల 29,30,31 తేదిల్లో ఖమ్మంలో జరుగు మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు కొండెబోయిన నాగేశ్వరరావు, నాయకులు కే.నరేంద్ర, తలారి దేవప్రకాశ్, ముండ్ల ఏకాంబరం, కొండెబోయిన ఉమావతి, కరకపల్లి రాయమల్లు, యనమగండ్ల రవి, ఎండీ. ఇస్మాయిల్, కల్తి రామచంద్రు, పాయం ఎర్రయ్య, పాసిన్ని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.