Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఎర్రుపాలెం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలలో ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోవడంతో అందులో భాగంగా సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం మూడు లక్షల రూపాయల ఆర్థిక సహా యం అందిస్తామని ఇటీవల మహబూబ్నగర్లో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో ఇల్లు లేని పేద కుటుంబాల కల నెరవేరేనా అని లబ్ధి దారులు చర్చించుకుంటున్నారు. మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయంగా ప్రభుత్వ నిబంధనలు ఖరారయ్యాయని సమాచారం. ఇళ్ల నిర్మాణం చేసుకునేందుకు లబ్ధిదారుల అర్హతలు, ప్రామాణికాలు, అనర్హతలు, పలు అంశాలపై భారీ కసరత్తు చేసిన అధికార యంత్రాంగం నిబంధనలను రూపొందించినట్లు తెలుస్తుంది. ఈ నెల10న ముఖ్య మంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరగనున్న క్యాబినెట్ భేటీలో ఈ పథకం పై చర్చించనున్నారు. ప్రభుత్వం ఈ పథకంపై ప్రకటన చేయను న్నట్లు సమాచారం. సొంత జాగా ఉన్న పేదలకు ఇళ్లనిర్మాణానికి 3 లక్షల రూపాయల సాయాన్ని అందించే పథకాన్ని 15 రోజులలో ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో అధికారులు ఆగమేఘాల మీద నిబంధనలను ఖరారు చేశారు.
ఇల్లు కట్టుకునే లబ్ధిదారుల నిబంధనలు
సొంత జాగా ఉండి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు అర్హులు. విడతల వారీగా మూడు లక్షల రూపాయల అందజేస్తారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం జరగని గ్రామాలకు తొలి ప్రాధాన్యతగా చెప్తున్నారు. ఇంటి నిర్మాణానికి కనిష్టంగా 75 గజాల స్థలం ఉండాలని, మహిళల పేరిటే ఇంటికి ఆర్థిక సహాయం అందిస్తారన్నారు. మండల తహసిల్దార్, ఎంపీడీవోలు లబ్ధిదారులను గుర్తించి కలెక్టర్ ఆమోదం కోసం పంపిస్తారని, ఎమ్మెల్యేలు, మంత్రుల పరిశీలన తర్వాతే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిసింది. గతంలో ఇందిరమ్మ ఇల్లు పొందిన వారు ఈ పథకానికి అనర్హులుగా ప్రకటిస్తారని, అనర్హులను వేరివేసేందుకు ఇప్పటికే ఆన్లైన్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నారని తెలిసింది. ఇప్పటి కైనా ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదల కుటుంబాలకు ఇల్లు నిర్మించుకునే కళ నెరవేరుస్తుందని లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తపరిచారు.