Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఎర్రుపాలెం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్టాండ్ ముళ్ళ చెట్లు, పొదలతో నిండిపోయి బస్టాండా...అడవా ప్రాంతమా అన్న రీతిలో దర్శనమిస్తోందని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. ఎర్రుపాలెం రైల్వేస్టేషన్‌కు అతి సమీపంలో గల ఆర్టీసీ బస్టాండును సర్కారు తుమ్మ చెట్లు ఎత్తుగా ఎదిగి, పొదలతో మూసివేశాయి. బస్టాండులో నుండి ప్రయాణికులు బయటికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌కి కూతవేటు దూరంలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉన్నాయి. ఇంత ప్రాధాన్యత కలిగిన కార్యాలయాలకు వెళ్లాలన్న బస్టాండ్‌ని దాటి పోవాల్సిందే, తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన పుణ్య క్షేత్రమైన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్లాలన్న ఈ రోడ్డు మార్గమే ప్రధాన రహదారి. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులో గల ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవేశించడానికి ఈ రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. బస్టాండుకు ఎదురు మెయిన్ రోడ్డు పక్కన ముళ్ళ చెట్లతో నిండిపోయి బస్టాండు కనిపించని విధంగా మారిపోయాయని ప్రజలు విమర్శిస్తున్నారు. ముళ్ళ చెట్లను తుప్పలను తొలగించి, వాహనాల రాకపోకలకు, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.