Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య
- తూరుబాక గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ధర్నా
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గ్రామాలలో స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు పోరాటాలు నిర్వహిస్తామని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పారు. గురువారం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తూరుబాక గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం గ్రామాలలో స్థానికంగా నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ గ్రామ పంచాయతీ సర్పంచ్ బి చందు, కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామపంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ.. పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కారం చేయడం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అనంతరం కారం పుల్లయ్య మాట్లాడుతూ... నత్త నడకన నడుస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మొండి గోడలతో ఉన్న ఇండ్లను వెంటనే స్లాబులు వేసి పూర్తి చేయాలని, 25 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇంతవరకు పూర్తి కాలేదని వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేశారు. తూరుబాక పంచాయతీ పరిధిలోని ఉన్న అంతర్గత రహదారుల గుండా రాకపోకలు సాగించే విధంగా రహదారి సౌకర్యం కల్పించాలన్నారు. పూర్తయినటువంటి డబుల్ ఇండ్లకు కరెంటు మీటర్లు ఏర్పాటుచేసి వెంటనే అరులైన పేదలందరికీ పంచి పెట్టాలని ఆయన ఈ సందర్భంగా వారికి సూచన చేశారు. అదేవిధంగా సొంత ఇంటి స్థలం ఉన్న అర్హులైన పేదలందరికీ ఐదు లక్షల రూపాయలు కేటాయించి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వంని కోరారు. గత మూడు సంవత్సరాల నుండి వృద్ధాప్య పెన్షన్లు, తెల్ల రేషన్ కార్డులు సమస్యను వెంటనే పరిష్కరించాలని, విద్యుత్ స్తంభాలు లేని వీధులకు స్తంభాలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన దళితులకు దళిత బంధు పథకం వర్తింపజేయాలన్నారు. లేదంటే రానున్న కాలంలో ఆందోళన పోరాటాలు చేపడతామని హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ, మర్మం చంద్రయ్య, స్థానిక ఉప సర్పంచ్ బొల్లి సత్యనారాయణ, శాఖా కార్యదర్శి కుమరికుంట్ల సాంబశివరావు, బొల్లి సాయిబాబు, స్థానిక వార్డు మెంబర్లు ప్రమీల, వెంకటరమణ, బిల్లా ముత్యాలరావు, గంప నాగిరెడ్డి, పొట్టి జాను, రాజు, తదితరులు పాల్గొన్నారు.