Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్య ప్రధాయనిగా భద్రాద్రి జిల్లా
- గూడెంలో నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు
- దూర బారాలు తగ్గనున్న వైనం
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆరోగ్య ప్రధాయనిగా మారింది. ఎప్పుడూ సరైన వైద్యం అందక నిత్యం మృత్యుఘోష వినిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఇటీవల మెడికల్ కాలేజి ప్రారంభించడంతో మెరుగైన వైద్యం కోసం ఎదురు చూస్తున్న మన్యం ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్న ఆశలు చిగురించాయి. ఇప్పటికే జిల్లా కేంద్రంలో మాతాశిశు సంరక్షణ అసుపత్రితో సుఖ ప్రసవాలు జరుగుతున్నాయి. వేలాది రూపాయలు ప్రయివేటు అసుపత్రికి కట్టకుండానే సురక్షితంగా కాన్పులు జరుగుతున్న తీరు అందరిలో ఆనందం నింపుతున్నాయి. తాజాగా కొత్తగూడెం నర్సింగ్ కాలేజ్ ఏర్పాటుకు వేగం పెరిగింది. జిల్లాకు మెడికల్, నర్సింగ్ కాలేజికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి విధితమే. ఈ క్రమంలో మెడికల్ కాలేజ్ యుద్దప్రాతిపదికన నిర్మాణాలు ప్రారంభించారు. వైద్య, విద్యను విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇప్పడు తాజాగా పట్టణ నడిబొడ్డున నర్సింగ్ కాలేజ్‌ని ప్రారంభించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్దమైంది.
కొత్తగూడెంలో నర్సింగ్ కళాశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని మెడికల్ కళాశాలకు అనుసంధానం చేయడంతోపాటు 60 మంది విద్యార్థులతో జనవరి నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సును ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నర్సింగ్ కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో అద్దె భవనంలో తరగతులు నిర్వహించనున్నారు. గతంలో నర్సింగ్ విద్య చదవాలంటే లక్షలలాది రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రయివేటు విద్య సంస్థల దోపిడికి గురికాకుండా ప్రస్తుతం స్థానికంగా కళాశాల ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు నర్సింగ్ విద్య అందుబాటులోకి వచ్చింది.
జనవరి నుంచి కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ తరగతులు ప్రారంభంకానున్నాయి. కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తరగతులు ప్రారంభించేందుకు యంత్రాంగంతో ఏర్పాట్లు చేయిస్తున్నారు. నాలుగేండ్ల నర్సింగ్ కోర్సుకు కళాశాలకు సొంత భవనం లేనందున అద్దె భవనంలో తరగతులు ప్రారంభం కానున్నాయి. కొత్తగూడెంలోని మధుర బస్తీ, రామాటాకీస్ రోడ్‌లోని అద్దె భవనంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భవనం పూర్తిగా కాలేజి నిర్వహణకు అనువుగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లేదు. ఎంతో కాలంగా అనేక రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాని నర్సింగ్ కాలేజి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో పల్లె దవఖానాలు ఏర్పాటు చేస్తుంది. పెద్దఎత్తున వైద్యంపై ప్రత్యే దృష్టి పెట్టిన నేపద్యంలో నర్సింగ్ విద్యకు మంచి డిమాండ్ పెరింది. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో ఎప్పటికప్పుడు నర్స్ పోస్టులకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. మిగతా కోర్సుల కంటే నర్సింగ్ పూర్తి చేసిన వారు. వెంటనే ఉపాధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
నర్సింగ్ మొదటి సంవత్సరంలో చేరేందుకు విద్యార్థులకు డిసెంబర్ చివరి వరకు అవకాశం ఉంది. అప్పటివరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. 60 మంది విద్యార్ధులతో జనవరి నుంచి తరగతులు ప్రారంభం కాను న్నాయి. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ భవనం తరగ తుల నిర్వహణకు సిద్ధమైంది. విద్యార్థులకు ప్రభుత్వం హాస్టల్ వసతి కల్పిస్తున్నది. ఇప్పటికే ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సి పాల్స్ నియమించినట్లు సమాచారం త్వరలో అధ్యాపకులు, సిబ్బంది నియామకం పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది.
జనవరిలో తరగతులు ప్రారంభం
మెడికల్ కాలేజీ అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ప్రారంభం కానున్నది. కాలేజీకి ఇప్పటికే ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్స్ నియమితులయ్యారు. త్వరలో అధ్యాపకులు, సిబ్బందిని నియమించనున్నారు. విద్యార్థులు డిసెంబర్ చివరిలోపు వెబ్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. జనవరి నెల నుంచి 80 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభం కానున్నాయని సమాచారం.