Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలక వర్గం తీర్మానంతో చెల్లింపులు
- ప్రయోజనం ఎవరికి?
నవతెలంగాణ-అశ్వారావుపేట
తీగ లాగితే డొంక కదిలిన చందంగా నిధులు దుర్వినియోగం ఆరా తీస్తే నియమ నిబంధనలు పాటించని వైనం బహిర్గతం అయింది. మేజర్ పంచాయతీలో కొందరు ''మేజర్'' నాయకుల కనుసన్నల్లో పాలక వర్గం పనిచేస్తుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆక్రమణలు తొలగింపుకు జరిగిందని పలు ఋజువులు తెలుపుతున్నాయి. పంచాయతీ రాజ్ శాఖ చేయాల్సిన పనులు ఆర్అండ్బీ ఎందుకు పర్యవేక్షించింది?, లక్షల్లో వ్యయం ఉన్నప్పుడు టెండర్ ఎందుకు పిలవలేదు?, రూ.9 లక్షల వ్యయంలో ముందుగా చెల్లించిన రూ.5 లక్షలకు లేని అభ్యంతరం మిగతా వాటికి ఎందుకు?, ఈ ముందస్తు చెల్లింపు ఆర్అండ్బి శాఖకు చెల్లించారా?, పనులు నిర్వహించిన వారికి చెల్లించారా?, ప్రయోజనం లేని ఈ తతంగంలో ఎవరి వాటా ఎంత? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక శాఖ పనులు మరో శాఖ చేపట్టాలంటే జిల్లా స్థాయి అధికారులు ఆమోదం తప్పని సరి. అలాంటిది పంచాయతీ పౌరుల నుండి ముక్కు పిండి వసూలు చేసిన పన్నులు రూపంలో వచ్చే ప్రజా ధనాన్ని వృధా చేసే అధికారం ఎవరు ఇచ్చారు అనే అంశాలు ఆదివారం నవతెలంగాణలో 'పంచాయతీ నిధులు రోడ్డు పాలు' ప్రచురితం అయిన కథనం ఆధారంగా ప్రతీ ఒక్కరూ ఆలోచన చేస్తున్నారు. ఈ కథనాన్ని అనేక గ్రూపుల్లో పంపిణీ చేయడంతో పాటు కొందరు పాలక వర్గం సభ్యులు వారి ఫోన్లో స్టాటస్గా పెట్టుకుని వైరల్ చేయడం గమనార్హం. పూర్తి వివరాలు రేపటి కథనంలో.