Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా దూలేరు గిరిజన గ్రామానికి చెందిన మూడేండ్ల చిన్నారికి ఉచితంగా వైద్య సేవలు అందించి ఆర్ఎంపి వైద్యుడు పాప ప్రాణాలు కాపాడాడు. రక్త హీనతతో ఉన్న చిన్నారిని చర్ల ఆర్ఎంపీ వైద్యుడు పుప్పాల మురళి వద్దకు తల్లిదండ్రులు తీసుకుని వచ్చారు. చర్లలో రక్త పరీక్షలు నిర్వహించగా రక్తం 4 గ్రాములు మాత్రమే ఉండటంతో వెంటనే తన సొంత ఖర్చుతో భద్రాచలం రామకృష్ణ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుడు కవిత అనే చిన్నారికి పరీక్షలు నిర్వహించి రక్తం తక్కువగా ఉండటంతో రక్తం ఎక్కించారు. రామకృష్ణ తన మానవత్వం చాటుకున్నారు. కణితి రాజు, సీత దంపతుల కుమార్తె కవితకు ఉచిత సేవలు అందించిన వారిని మేమున్నాం కమిటీ చైర్మెన్ నీలి ప్రకాష్ అభినందించారు. చిన్నారికి పండ్లు పంపిణీ చేశారు.