Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కార్యదర్శి ఏజె.రమేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
సిద్దిపేట జిల్లా కేంద్రంలో డిసెంబర్ 21వ తేదీ నుండి 23వ సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర మహాసభలలు జరుగునున్నాయని, ఈ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజె.రమేష్ పిలుపు నిచ్చారు. ఆదివారం కొత్తగూడెంలో సీఐటీయూ కార్యాలయంలో జరిగిన జిల్లా ఆఫీసు సమావేశంలో రాష్ట్ర నాలుగవ మహాసభ ప్రచార వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏజే మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యుత్ చట్టాన్ని, లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా దేశ సంపదను స్వదేశీ విదేశీ కార్పొరేట్ కంపెనీలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం దోచిపెడుతుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాలు జీవాలను వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు గడుస్తున్న ప్పటికీ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కనీస వేతనాలని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయటం సిగ్గుచేటైన విషయమని పేర్కొ న్నారు. రాష్ట్ర మహాసభల్లో రాష్ట్రం లోని అన్ని రంగాల కార్మికులు ఎదు ర్కొంటున్న సమస్యలపై చర్చించి పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తామని రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మచారి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను, అర్జున్, ధనలక్ష్మి, ఐలయ్య, సహాయ కార్యదర్శి డి.వీరన్న, వెంకటరాజు, కె.సత్య తదితరులు పాల్గొన్నారు.