Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రసాదరావు
- మండల అధ్యక్షునిగా సూరిబాబు
- రైతు మండల అధ్యక్షులు తంత్రపల్లి
నవతెలంగాణ-దుమ్ముగూడెం
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపులు అన్ని రంగాలలో రాణించాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వల్లాల ప్రసాదరావు అన్నారు. ఆదివారం మండలంలోని చిన్నబండిరేవు గ్రామంలో మండల కన్వీనర్ పూదోట సూరిబాబు అధ్యక్షతన జరిగిన మున్నూరు కాపు మండల కుల బాందవుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాపులు ఐక్యతతో ముందుకు వెళితే మన హక్కులను, రిజర్వేషన్లను పోరాడి సాదించుకోవచ్చాన్నారు. రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ ఆధ్వర్యంలో త్వరలో హైదరాబాద్ నగరంలో సుమారు 5 లక్షల మందితో మున్నూరు కాపు గర్జన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.1000 కోట్లు నిధిని కేటాయించాలన్నారు. రాష్ట్ర విభజన తర్శాత జిల్లాలో ఉన్న మున్నూరు కాపులందరికీ బీసీ సర్టిపికెట్టు ఇవ్వాలని దీని పై జీఓ తీసుకు వచ్చేందు రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకు వెళతానన్నారు. ఈ సమావేశంలో డివిజన్ అద్యక్షులు దణపనేని వెంకటే శ్వర్లు, చర్ల, దుమ్ముగూడెం మండలాల అద్యక్షులు నాగభూషణం, జక్కుల శ్యాంకుమార్, జిల్లా నాయ కులు పాపిశెట్టి మనోహర్, బండి వినోద్ క్రాంతి, జక్కుల రవికుమార్ తదితరులు పాల్గొనగా మండల కమిటీ, రైతు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మండల అధ్యక్షుడిగా పూదోట సూరిబాబు
మున్నూరు కాపు సంఘం మండల అద్యక్షుడిగా పూదోట సూరిబాబును ఎక గ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులు పత్తివాడ జగదీష్, యడ్ల అప్పారావు, ప్రధాన కార్యదర్శిగా కొమ్ము బాలకృష్ణ, జాయింగ్ సెక్రటరీగా తూంపెల్లి ఏసుబాబు, కొమ్ము సురేందర్, సెక్రటరీగా అకుల వీరమోహన్, కొండపల్లి నరేందర్, అర్గనైజింగ్ సెక్రటరీగా తంత్రపల్లి విద్యాసాగర్, యాసాల ముత్యాలరావు, కోశాధికారిగా కొమ్ము రంజిత్ కుమార్, కార్యవర్గ సభ్యులు ఆకుల రామకృష్ణ, నంది సత్యం, చిర్తాని చంద్రశేఖర్, కనుబుద్ది దేవాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రైతు కమిటీ మండల అధ్యక్షులగా తంత్రపల్లి వెంకటేశ్వరరావు
మున్నూరు కాపు సంఘం రైతు కమిటీ మండల అధ్యక్షులుగా తంత్ర పల్లి వెంకటేశ్వరరావు ఏకగ్రీ వంగా ఎన్నికయ్యారు. ఆయన నియామకాన్ని రాష్ట్ర నాయకులు వల్లాల ప్రసాదరావు, డివిజన్ అద్యక్షులు దణపనేని వెంకటేశ్వర్లు ప్రకటించడంతో పాటు నియామకపు పత్రాన్ని ఆయనకు అందజేశారు.