Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దూరమౌతున్న అనుచరులు
నవతెలంగాణ-కొణిజర్ల
వైరా నియోజకవర్గంలోని మాజీ ప్రజాప్రతినిధులు ప్రతిష్ట మసకబారుతుందని నియోజకవర్గంలోని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాళ్లు ప్రజాప్రతినిధులుగా ఉన్న హయాంలో అన్ని తామై వ్యవహరించిన నాయకులంతా ఒకొక్కరుగా దూరమౌతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తమ హయాంలో ఆర్థికంగా నిలదోక్కుకోని రాజకీయంగా పదవులు పొందిన నాయకులంతా శూభకార్యాల్లో తాము కనిపించిన తప్పించుకుంటూ తిరుగుతున్నారని మాజీలు వారి సన్నిహితులతో చెప్పుకుంటూ వాపోతున్నారంటా..
ఇది ఇలా ఉండగా నిన్న మొన్నటి వరకు అనుచరులతో కలిసి నియోజకవర్గంలో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ నానా హడావుడి హంగామా చేసిన మాజీలు గతకొంత కాలంగా తమ పక్కన ఉన్న అనుచరుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతుండటంతో నియోజకవర్గంలో ఒకటి రెండు మండలాల్లో మినహ మిగిలిన మండలాల్లో అనుచరులు ఎవరూ లేకపోవడంతో అ మండలాల్లో పర్యటించడానికి మాజీలు పెద్దగా ఇష్టపడటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అ మాజీలు తమ పాత అనుచరులను కలిసి తిరిగి నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా విఫలమైతున్నాయనే నిరుత్సాహంలో ఉన్నారని వినికిడి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకంటే తనకే టికెట్ వస్తుందని చెప్పుకుంటూ తిరుగుతున్న మాజీలు అనుచరులు లేకుండా ఎన్నికల్లో ముందుకు ఏలా వెళతారని అసలు టికెట్ వస్తుందా లేదా సిట్టింగ్ కే ఇస్తారా పొత్తుల్లో బాగంగా వామపక్ష పార్టీకి దక్కుతుందని అనేది వేచిచూడాలి.