Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విసిగ్గుగా ఉన్న బండి సంజయ్ వ్యాఖ్యలు
- విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ-ఖమ్మం
ఎమ్మెల్సీ కవితపై సీబిఐ విచారణ వెనక కుట్ర దాగి ఉందని, సిబిఐ విచారణ చేస్తున్నట్లుగా లేదని, విచారణ నిష్పక్షపాతంగా చేపట్టాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసన సభ్యుల కొనుగోలు అంశం విఫలమైన తర్వాత బిజెపి ఈడి, సిబిఐ విచారణను తీవ్రతరం చేసిందన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యలు నిసిగ్గుగా ఉన్నాయన్నారు. బిఆర్ఎస్లో ఉంటే పూనితం అయినట్లుగా ఉందని ప్రతిపక్ష నేతలను బెదిరించి బిజెపిలోకి వలసలను ప్రోత్సహిస్తున్నట్లుగా బిజెపి చర్యలు ఉన్నాయన్నారు. బిఆర్ఎస్లో ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ బిజెపిలోకి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వారి వ్యవహారశైలి ఉందన్నారు. సిబిఐ రావాలంటే రాష్ట్ర అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. అనుమతి తీసుకోకుండానే ఎలా విచారణ చేస్తారని కూనంనేని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా అన్ని రాజ్యాంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తుందన్నారు. లలితెమెడీ, విజయ్ మాల్యలపై చర్యలు తీసుకోకుండా తాత్సర్యం చేస్తుందన్నారు. మరో పక్క కార్పొరేట్ శక్తులుగా విరాజిల్లుతున్న అదానీ, అంబానీలు ఆస్తులను పైపైకి పెంచేందుకు బిజెపి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. దీంతో ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం పొంచి ఉందని కూనంనేని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి అడుగడుగునా రెండు నాల్కలా ధోరణిని అవలంభిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. కవితపై సిబిఐ విచారణను లైవ్లో చేపట్టి విచారణను బహిరంగ పర్చాలన్నారు.
అయితంకు నివాళులర్పించిన కూనంనేని
స్వాతంత్య్ర సమరయోధులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయితం వెంకటేశ్వర్లు దశ దిన కర్మ ఆదివారం ఖమ్మంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరై తొలుత ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసి దొండపాటి రమేష్ తదితరులు ఉన్నారు.