Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం (ఖమ్మం రూరల్)
ఈ నెల 15, 16 తేదీల్లో జరుగు 48 గంటల వంటా వార్పు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆశా వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంగ, బానోతు అమల, ఆర్గనైజింగ్ కార్యదర్శి పిన్నింటి రమ్య, జిల్లా నాయకులు బి సునీత, బి.జ్యోతి పిలుపు నిచ్చారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలంలో ని ఆరెంపుల, తెల్దారుపల్లి, మద్దులపల్లి, పెద్ద తండా, ఎం.వెంకటాయపాలెం, పొన్నెకల్లు, తల్లంపాడు, గొల్లపాడు, పోలేపల్లి గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా కార్యకర్తల సమస్యలను పెండింగ్ పారితోషకాలను అలాగే లెప్రసి సర్వేకు డబ్బులు ఇవ్వాలని, వివిధ సమస్యలపై ఈనెల 15 ,16 తేదీలలో ఖమ్మం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ధర్నా చౌక్ లో జరుగు 48 గంటల వంట వార్పు కార్యక్రమాన్ని ఆశా కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఆశా కార్యకర్తల సేవలు అమోఘమైనవని, కరోనా మొదటి దశ రెండో దశ మూడవ దశలో ఆశా కార్యకర్త చేసినటువంటి సేవలు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించిందని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రుల సైతం ఆరోగ్య కార్యకర్తల సేవలను కొనియాడారని కానీ వారికి వేతనం మాత్రం నావు మాత్రం ఉందని అన్నారు. ఆశా కార్యకర్తలకు పారితోష్కాలతో సంబంధం లేకుండా కనీస వేతన 26 వేల రూపాయల ఇవ్వాలని, అప్పటివరకు ఫిక్స్డ్ వేతనం 10వేల రూపాయలు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న ఐదు సంవత్సరాలు యూనిఫామును వెంటనే ఇవ్వాలని, పియఫ్ ,ఇయస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, అర్హత కలిగిన ఆశా కార్యకర్తలకు సెకండ్ ఏ నెంబరుగా ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెరురుమాళ్ళపల్లి మోహన్ రావు, ఆశా వర్కర్ యూనియన్ మండల బాధ్యులు మాచర్ల సుభద్ర, నాగమణి, కత్రా ఉమ, ఉప్పలమ్మ పాల్గొన్నారు.