Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకట్టుకున్న రెడ్డి ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం
- రిటైర్డ్ ఉద్యోగులకు సత్కారం..
- పేద విద్యార్థులకు సహాయం
- ఆటపాటలతో రోజంతా సందడే సందడి
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
గవర్నమెంట్ రెడ్డి ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ( గ్రేట్) ఆత్మీయ సమ్మేళనం స్థానిక చెరుకూరి గార్డెన్ లో ఆదివారం అత్యంత సందడిగా నిర్వహించారు. గ్రేట్ సమ్మేళనానికి వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న రెడ్డి ఉద్యోగులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. రోజంతా ఆటపాటలతో గడిపారు. అపెక్స్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ కిశోర్ రెడ్డి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ సైతం ఏర్పాటు చేశారు. వివిధ వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. సంఘం ఆవిర్భవించిన 2015 నుంచి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులను సన్మానించారు. ప్రతిభ కనబరుస్తున్న పేద విద్యార్థులకు సంఘం తరఫున రూ.16 లక్షలు అందజేశారు. దాతల ద్వారా సేకరించిన మరో రూ.10లక్షలు పెద విద్యార్థులకు చదువు నిమిత్తం అందించారు.
పసందైన వంటలు...ఆటపాటలు
గ్రేట్ ఉద్యోగులు రోజంతా ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. పలు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి గ్రేట్ టీం కోర్ కమిటీ సభ్యులు కుటుంబాలను వేదికకు పరిచయం చేశారు. బతుకమ్మ, కోలాటం ఆటలతో మహిళలు రోజంతా సందడిగా గడిపారు. ఆటల పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వెజ్, నాన్ వెజ్ తో చేసిన పసందైన వంటలను ఆచరించారు. సంస్థ పురోభివృద్ధికి తోడ్పడుతున్న గ్రేట్ ఉద్యోగులను వ్యవస్థాపకులు యాచవరపు శ్రీకాంత్ రెడ్డి అభినందించారు. గ్రేట్ లోగో టమాట ఆవశ్యకతను వివరిస్తూ...అన్ని కూరల్లోకి టమాట ఎలా కలుస్తుందో రెడ్డిలు కూడా అన్ని కులాల వారితో కలుపుగోలుగా స్నేహభావంతో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామసహాయం అజిత్ కుమార్ రెడ్డి , గుర్రాల బలరాం రెడ్డి, పెసర ప్రభాకర్ రెడ్డి, గాదె మాధవరెడ్డి , తిప్పిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, అనురాధరెడ్డి, మాధవి తదితరులు పాల్గొన్నారు.