Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ కవుల మధ్య 'కథాసంకలనం' పుస్తకావిష్కరణ
- ఖమ్మం చరిత్రలో నూతన అద్యయనం 'ఖమ్మం ఈస్తటిక్స్'
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం జిల్లా చరిత్రలో సాహిత్య పునరుత్తేజం చెంచేందుకు 'ఖమ్మం ఈస్తటిక్స్' ప్రారంభించిన సాహిత్య పురస్కారాల సభకు 'లేక్యూ క్లబ్' వేదికయ్యింది. దేశం నలుమూలల నుండి తెలుగు భాషా కవుల రాకతో ప్రాంగణం కవిత్వం పరిమళాలు వెదజలింది. ఆధ్యంతం ఎంతో గంభీరంగా ఆలోచనాయుతంగా సాగిన ఈ సభ ఖమ్మం ద్వారా ఖమ్మం ఈస్తటిక్స్ మరో అధ్యయానికి శ్రీకారం చుట్టింది. ప్రముఖ కవులు ప్రారంభం ఆహ్వానాలతో ప్రారంభమై సభాధ్యక్షులు రవిమారుత్ తొలిపలుకుల అనంతరం వేదిక నలంకరించిన అతిథుల ఉపన్యాసాలతో ఉర్రూతలూగింది. తెలుగు సాహిత్య అభివృద్ధికై గత కొన్ని నెలలుగా ఖమ్మం ఈస్తటిక్స్ బాధ్యులు దేశ వ్యాప్తంగా వివిధ దేశాల తెలుగు కవుల కవిత్వం, కథలను పోటీలకు ఆహ్వానించింది. సుమారు 120 కవిత్వ సంకలనాలు, 100పైగా కథలు పోటీకి పంపడ్డాయి. ఉత్తమ కవితా సంపుటిని ఎంపిక చేశారు. పసునూరి శ్రీధర్ బాబు రాసిన 'నిదురపోని మెలకువచెప్పికల' మొదటి పురస్కారానికి ఎంపికైంది. ప్రోత్సాహక పురస్కారాలకు రేఖా జ్యోతి రాసిన 'ఆగినచోటునుంచే మళ్లీ ' కోడే భారతి రాసిన ఎన్నో రంగులచీకటి ఎంపికయ్యాయి. ఈ సభకు అతిథులుగా ఖాదర్, మధురాంతకం, ఎల్ఎస్ఆర్ ప్రసాద్; లక్ష్మినర్సయ్య ఖాదర్ బాబు, పెద్దంటి అశోక్‌కుమార్, వెంకట కృష్ణ రమణ మూర్తి, వంశీకృష్ణ, నీరజ, రఘు, అనిల్ డ్యానీ పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.