Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తున్న అన్నా చెల్లెలు
- జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఎజన్సీ ప్రాంతమైన మండలంలోని మారు మూల మన్యం గ్రామమైన లింగాపురం గిరిజన గ్రామంలో అతి నిరుపేద ఆదివాసీ కుటుంబంలో జన్మించిన ఆదివాసీ బిడ్డలు అన్నా చెల్లెలు జాతీయ స్థాయి క్రీడల్లో తమ ప్రతిభ సత్తా చాటుతూ రాణిస్తున్నారు. లింగాపురం గ్రామానికి చెందిన కాకా జోగారావు, కాకా రమణలు అన్నా చెల్లెల్లు. జోగారావు ప్రస్తుతం మణిపూర్‌లోని నేషనల్ ష్టోర్స్ యూనివర్శిటీలో బ్యాచ్‌లర్ ఆఫ్ స్పోర్ప్ (బీఎస్సీ) విద్యను అభ్యశిస్తున్నాడు. జోగారావు చెల్లి రమణ కాకాతీయ యూనివర్శిటీ వరంగల్ నగరంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యను అభ్యశిస్తుంది. జోగోరావు అద్లెటిక్స్లో లాంగ్ జంప్, జావెలింగ్‌త్రో, ట్రిపుల్ జంప్, 200, 100 మీటర్ల పరుగుపందెంతో పాటు కోకో, కబడ్డీ, వాలీబాల్ క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. ఈ నెల 9, 10 తేదీలలో మణిపూర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి కోకో క్రీడల్లో తన ప్రతిభ సత్తా చాటి జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికయ్యాడు. రమణ వాలీబాల్, షఉటింగ్ బాల్ క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణిస్తోంది. ఈ నెల 9, 10 తేదీలలో కే సముద్రంలో జరిగిన 41వ స్టేట్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ షఉటింగ్ బాల్ అసోసియేషన్ ఆద్వర్యంలో నిర్వహించిన క్రీడల్లో షఉటింగ్ బాల్లో జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైంది.
కాగా రమణ ఈ నెల 23, 24, 25 తేదీలలో గుజరాత్లో .జరిగే జాతీయ స్థాయి షఉటింగ్ బాల్ క్రీడల్లో పాల్గొననుంది. జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన రమణ నవతెలంగాణతో మాట్లాడుతూ తన అన్నయ్యను ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణిస్తున్నాని ముందు ముందు అంతర్జాతీయ స్థాయిలో ఆడలనేదే తన కోరిక అని తెలిపింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ క్రీడా స్పూర్తిని చాటుతామని, చెబుతున్న ఆదివాసీ అన్నా చెల్లెలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పవచ్చు.