Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశయాలు సాధించడమే నిజమైన నివాళి
- యాకయ్య సంస్మరణ సభలో పలు పార్టీల నేతలు
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణంలోని వినోభాకాలనీలో ఆదివారం సిపిఎం సీనియర్ నాయకులు దేవులపల్లి యాక్య సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం భద్రాద్రి, మహబూబాబాద్, జిల్లా కార్యదర్శులు అన్నవరపు కనయ్య, సాధుల శ్రీనివాసరావు, సిఐటియు అఖిలభారత ఉపాధ్యక్షులు సాయిబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.సోమయ్య, మిడియం బాబురావు, మచ్చా వెంకటేశ్వర్లు, ఏజె.రమేష్, మాచర్ల భారతి, సీనియర్ నాయకులు నర్సయ్య, మెరుగు రమణ, సత్యనారాయణ,సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నర్సింహారావు, మహబూబాబాద్ సిపిఎం జిల్లా నేత కందునూరి శ్రీను,మండా రాజన్న, ఇల్లందు పట్టణ నాయకులు తాళ్ళూరి కృష్ణ, సురేష్, మోహన్‌రావు, ఆలేటి కిరన్, సంధ్య, టిఆర్ఎస్ నేత,ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర నాయకులు ఏపూరి బ్రహ్మం, ప్రజా పంధా రాష్ట్ర నాయకులు చంద్ర శేఖర్, టిడిపి పట్టణ అద్యక్షులు ముద్రగడ వంశీ,కాంగ్రేస్ పార్టీ పట్టన అద్యక్షులు డానియల్,లేబర్ పార్టి అద్యక్షులు బట్టు,వైసిపి నేత రాములు,తుడుందెబ్బ నేత ఈసం నర్సింహారావులు దేవులపల్లి యాకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణ కార్యదర్శి నబి అధ్యక్షతన సభ నిర్వహించారు. మండల నాయకులు ఆలేటి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్బంగా జరిగి కార్యక్రమంలో మాట్లాడారు.
యాకయ్య విజ్ఞాన కేంద్రం విలసిల్లాలి : మాజీ ఎంపి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మిడియం బాబురావు
సామాజిక ఉద్యమాల్లో దేవులపల్లి యాకయ్యకు పట్టుంది. ఆయన పేరున నెలకొల్పనున్న విజ్ఞాన కేంద్రం విలసిల్లాలి. కార్మిక వర్గం,ప్రజలు చైతన్యం కావాలి. నేడు అబద్దాన్ని నిజం చేసే శక్తులు,శత్రువులు వచ్చారు. దేశానికి ప్రమాదకరంగా ఉంది. ఈ దశలో యాకయ్య ఆశయాలు నెరవేర్చవానికి పార్టీ శ్రేణులు ఉద్యుక్తులు కావాలి.
ఉద్యమాలను కాపాడాల్సిన బాధ్యత పార్టీపై ఉంది : సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాచర్ల భారతి
మండలంలో ఉద్యమాలు కాపాడాల్సిన బాధ్యత స్థానిక పార్టీపై ఉందన్నారు. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన ధన్యజీవి. కుటుంబానికి ఎర్ర జెండా అండగా ఉంటుంది. యాకయ్య సతీమణి సోమలక్ష్మి చేసిన సేవలు మరువలేనివి. నేడు దేశంలో మహిళలపట్ల అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. కమ్యూనిస్టు ప్రభుత్వాలే దేశానికి సమాజానికి కావాలి.యాక్య స్పూర్తితో డివిజన్లో పార్టీ బలోపేతం చేయాలి.
కమ్యూనిస్టు సిద్దాంకోసం కట్టుబడిన నేత : సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
జిల్లా కమిటీ ముఖ్య నేతను కోల్బొయింది. విచారకరం. కమ్యూనిస్టు సిద్దాంకోసం కట్టుబడిన నేత. సమస్యల పరిష్కారం కోసం చనిపోయేవరకు ఉత్సాహంగా పనిచేశారు.ఇటీవల జరిగిన ప్లీనానికి సైతం హాజరయ్యారు. భౌతికంగా లేకపోవడం విచారకరం. గ్రంధాలయం ఏర్పాటు చేయాలని గతంలోనే స్దలాన్ని కొన్నారు. ఆ స్ధలంలోనే ఆయన పేరుతో విజ్ఞాన కేంద్రం నెలకొల్పాల్సి వచ్చింది.కుటుంబం సైతం విజ్ఞాన కేంద్రానికి తోడ్పాటు అందించడం అభినందనీయం. దాతలు ,శ్రేయోభిలాషులు అభిమానులు త్వరితగతిన పూర్తి చేయాలి.
అందరి అభిమానాలు పొందిన నేత : సిపిఎం పార్టీ మహబూబబాద్ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్
ప్రజా సేవకునిగా, ప్రజా ప్రతినిధిగా అందరి అభిమానాలు పొందిన నేత దేవులపల్లి యాకయ్య. సమస్యలపై ఉద్యమాలు చేస్తు ఉత్సాహపరిచే కమ్యూనిస్టు నేతన్నారు. ఆయన మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని నష్టం.లోటును పూడ్చుకోవాలి.
ఆదర్శప్రాయుడు యాకయ్య : మున్సిపల్ ఛైర్మన్ డివి
సిపిఎం సీనియర్ నేత దేవులపల్లి యాకయ్య ఆదర్శప్రాయుడని మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు అన్నారు. ఆయన మృతి బాధాకరమన్నారు. మున్సిపల్ కౌన్సిలర్‌గా ప్రజా సమస్యలు వెలికితీసి పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. ప్రజల మన్ననలు పొందుతూ ప్రజాభిమానం పొందారని అన్నారు. ఆయన బాటలో నడవడమే నివాళి అన్నారు. కుటుంబానికి సంతాపం ప్రకటించారు.
సిద్దాంతానికి కట్టుబడి ఉన్న నేత : ప్రజాపంధా రాష్ట్ర నేత చంద్రశేఖర్
పార్టీల్లో తేడాలు ఉన్నా సొంత అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం. ఆప్యాయతలు ఆయన నుండి నేర్చుకున్నాం. అనేక మంది ప్రలోభాలకు లొంగినా పార్టీ సిద్దాంతానికి కట్టుబడి ఉన్నారు. భవిష్యత్ ఉందని ఎర్ర జెండాను నమ్ముకుని 50 ఏండ్లు పనిచేశారు. అంతిమ విజయం కమ్యూనిజందే అన్నారు.
మంచి నాయకున్ని కోల్బోయాం : సిపిఐ రాష్ట్ర నాయకులు ఏపూరి బ్రహ్మం
కలిసి పనిచేశాం. మంచి నాయకున్ని కోల్బోయాం.శ్రమజీవుల అభివృద్ధి కోసం పనిచేశారు.ఎన్నొ కష్టాలు ఎదురరైనా ముందుకు నడిచారు.భూమి ఉన్నంతవరకు కమ్యూనిస్టులకు విలువ ఉంటుంది.
నిస్వార్ధ సేవ అందించిన నేత : కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు డానియల్
ఇల్లందు డివిజన్, మూడు మండలాల ఏర్పాటు చేయాలని అఖిపక్ష సమావేశాలు నిర్వహించారు. ఇల్లందు అభివృద్ధికి అఖిపక్ష సమావేశాలు నిర్వహించారు. నిస్వార్ధ సేవకులు. ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ప్రజలతో మమేకై ఉద్యమాలు చేసి సమస్య సాధనకు కృషి చేశారు. ఆయన మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటు. కుటుంబానికి కాంగ్రేస్ పార్టీ తరపున సంతాపం తెలిపారు.
మాస్ క్యారెక్టర్ యాకయ్య : సిఐటియు అఖిలభారత ఉపాధ్యక్షులు సాయిబాబు
ప్రజల్లో ఉద్యమాల్లో మాస్ క్యారెక్టర్‌గా దేవులపల్లి యాకయ్య పనిచేశారని అన్నారు. ఎన్ని ఆటుపోటులు వచ్చినా చెక్కుచెదరకుండా పార్టీకోసం నిలబడ్డ నేతన్నారు. నమ్ముకున్న మార్సిస్టు సిద్దాంతానికి పోరాట తత్వం ఉందన్నారు. డేరింగ్ నాయకునిగా పని చేశారు. కమ్యూనిస్టు పార్టీలు చిన్నవిగా ఉన్నా తన వంతు కృషి చేశారు. నేడు ప్రమాదకర రోజులు వచ్చాయి. అనేక దారుణాలు జరుగుతున్నాయి. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. దేశం, రాష్ట్రం కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దశలో దేవులపల్లి యాకయ్యను కోల్పోవడం విచారకరం. ఆయన ఆశయాలు సాధించడమే నిజమైన నివాళి.
డివిజన్లో పార్టీని నిలబెట్టిన నేత :
సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు పి. సోమయ్య
ఇల్లందు డివిజన్లో సిపిఎం పార్టీని నిలబెట్టిన నేత దేవులపల్లి యాకయ్య. ముఖ్యంగా సిడిఎస్ సమ్మెకు యాక్షన్ కమిటీ ఏర్పాటులో కీలకమైన పాత్ర పోషించారని అన్నారు. ఆనాడు కుంబం మీద అనేక దాడులు జరిగాయన్నారు. అనేకసార్లు దెబ్బలు తిన్నారు. ప్రజలను చైతన్యపరచడంలో అందరు నేతలు ఒకలాగ ఉండరు. బాధ్యతలను బట్టి స్థాయి వస్తుందన్నారు. ఆనాడు కొందరు పార్టీ విడిచి వెళ్ళినా నిబద్దతతో నిలబడ్డారు.
యాకయ్య ఆశయ సాధనకు పాటుపడతా : యాకయ్య కుమార్తె, ఐద్వా పట్టణ కార్యదర్శి సంధ్య
ప్రజా సేవ చేసి ప్రజల మన్ననలు పొందిన మా నాన్న యాకయ్య ఆశయ సాధనకు కృషి చేస్తాను. ఆయన మూలంగానే ఈనాడు ఈ స్థితికి వచ్చానని అన్నారు. ఆయన జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబం అంతా పార్టీ సేవలో ఉందన్నారు. బస్తీలో,పట్టనంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.