Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-ఖమ్మం
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఈపీఎస్ పెన్షన్‌దార్లకు రూ.9వేల కనీస పెన్షన్‌గా నిర్ధారించాలని, దాన్ని వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా మహాసభలు ఆదివారం పట్టణంలోని మంచి కంటిభవన్లో జరిగాయి. సంఘం జెండాను సంఘం రాష్ట్ర కార్యదవర్గ సభ్యులు ఫణింద్ర కుమారిచ జాతీయ జెండాను టీఏపీఆర్్పీఏ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.శ్రీరాములు ఆవిష్కరించారు. సంఘం అధ్యక్షులు గోపీచంద్ అధ్యక్షత జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి హాజరై మాట్లాడుతూ.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఈపీఎస్ పెన్షన్‌దార్లకు రూ.9వేల కనీస పెన్షన్‌గా నిర్ధారించాలని, దాన్ని వెంటనే అమలు చేయాలని, పాత పెన్షన్ పునరుద్ధరించిన రాష్ట్రాలకు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించిన మొత్తాలను తిరిగి కేంద్ర ప్రభుత్వం వాపస్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు పాలకుర్తి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించవల్సి ఉన్న మూడు డీఏలను పెన్షనర్స్‌కు మంజూరు చేస్తూ ఏక మొత్తంలో చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రధాన కార్యదర్శి మచ్చా రంగయ్య, జిల్లా గౌవవ అధ్యక్షులు వాసిరెడ్డి మల్లికార్జునరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టీఎన్రావు, వి. భాస్కర్‌రావు, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు జీవీ. నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సభలో సమస్యలపై తీర్మాణాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం నాగేశ్వరరావు ప్రవేశ పెట్టిన కార్యదర్శి నివేదికపై సభ్యులు చర్చలో పాల్గొన్నారు. కార్యదర్శి రిపోర్టును, ఆర్థిక రిపోర్టును చర్చల అనంతరం సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.