Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
శ్రీచైతన్య వార్షిక ముగింపు క్రీడోత్సవాల్లో భాగంగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో పండగ వాతావరణంలో జరిగింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మేయర్ నీరజ, జెడ్పీ చైర్మెన్ లింగాల కమల్‌రాజ్, సుడా చైర్మెన్ బచ్చు విజయ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు క్రీడలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ ఆటలు చక్కటి ఆరోగ్యానికి ఎంతైన అవసరం అన్నారు. విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ..
చక్కటి ఉత్సాహపూరిత వాతావరణంలో క్రీడల్లో పాల్గొని మానసిక ఆనందాన్ని పొందారని అన్నారు. డైరెక్టర్ శ్రీ విద్య మాట్లాడుతూ.. క్రీడలు చక్కటి ఆరోగ్యానికి ఆనందానికి దోహదపడతాయని అన్నారు. గతరెండు రోజులుగా జరుగుతున్న క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతలు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో శ్రీచైతన్య ఓలంపియాడ్ స్కూల్ విద్యార్థులు ఓవరాల్ చాంపియన్స్‌గా నిలిచారు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన శ్రీ చైతన్య బోధన సిబ్బంది క్రీడల్లో గెలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పలు జిల్లాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.