Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
చుంచుపల్లి మండల పరిధిలో ఏజెన్సీ నిబంధనలకు, పంచాయతీ చట్టాలకు వ్యతిరేకంగా వెంచర్ వేయడమే కాకుండా చెరువును సైతం కబ్జా చేసి అక్రమ వెంచరు వేసిన వ్యక్తులపై, వారికి సహకరిస్తున్న పంచాయతీ, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి రామాంజనేయ కాలనీ పంచాయతీ సర్వే నెంబర్ 137/1లో అక్రమంగా వేసిన వెంచర్ వేసి చెరువును కబ్జా చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుంచుపల్లి మండలం పూర్తిగా 1/70 యాక్ట్ పరిధిలో ఉంటుందని ఇక్కడ వెంచర్లు వేసి ప్లాట్లు చేసి అమ్మడం పూర్తిగా వ్యతిరేకమని కొంత మంది అధికారుల ప్రోద్బలంతో రామాంజనేయ కాలనీ పంచాయతీ కార్యాలయం ఎదుటనే వెంచరు వేసిన ఉన్నతాధికారుల ఒత్తిడి మూలంగా క్రింది స్థాయి సిబ్బంది చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. జిల్లా అధికారులు తక్షణమే స్పందించి చెరువును కబ్జా చేసి అక్రమ వెంచరు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని లేనియెడల బీఎస్పీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాయి, మాలోత్ వీరు నాయక్, కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు బాపనపల్లి కళ్యాణ్, చేనిగారపు నిరంజన్ కుమార్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.