Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్
నవతెలంగాణ-కొత్తగూడెం
ఖమ్మంలో జరిగే పేదల బహిరంగ సభకు వేలాది మంది తరలి రావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆదివారం జరిగిన పలు జనరల్ బాడీ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల గురించి పట్టించుకోవడం లేదన్నారు. పేదలకు నివసించడానికి కనీసం ఇల్లు కూడా లేక అనేక అవస్థలు పడుతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదల హక్కుల కోసం భవిష్యత్తు పోరాటాల రూపకల్పనకు డిసెంబర్ 29న జరిగే మహాసభలను, బహిరంగ సభను జయప్రదం చేయాలని ప్రసాద్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, జిల్లా నాయకులు భూక్యా రమేష్, బాలకృష్ణ, ప్రేమ్ కుమార్, సిద్దెల రాములు, నాగదుర్గ, జబ్బ సంధ్యారాణి, పూజారి నాగమణి, రామ, వేముల నాగమణి, మెస్సు రామకోటమ్మ, తదితరులు పాల్గొన్నారు.