Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఆదివారం శివాలయం నందు మణుగూరు గ్రామ ముదిరాజ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. అధ్యక్షులుగా కురం శ్రీను, ఉపాధ్యక్షులుగా కురం.రవి, కార్యదర్శిగా పొన్నెబోయిన.వెంకటేశ్వర్లు, కోశాధికారిగా ఐతనబోయిన రమేష్‌లను ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ఐతనబోయిన వెంకన్న, కురం వెంకన్న, ఆత్మకూరి అంజయ్య, ఐతనబోయిన రాములు, కొమ్ము సోమయ్య గౌరవ సలహా దారులుగా తోడేటి వెంకటేశ్వర్లు, కమిటీ మెంబర్ లను ఎన్నుకోవడం జరిగింది. యూత్ కమిటీ అధ్యక్షులు గాపేర్ల.వీరన్న ఉపాధ్యక్షులుగా తోడేటి వీరభద్రం, కార్యదర్శిగా ఐతనబోయిన సతీష్, సహాయ కార్యదర్శులుగా బోళ్ళ సాంబశివరావు, కురం.వీరన్న, పిట్టల సాంబశివరావులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన అధ్యక్షులు కార్యదర్శులు మాట్లాడుతూ ముదిరాజులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని, ముదిరాజులను బిసి (డి) నుండి బిసి(ఎ) లోకి మార్చే వరకు దశలవారీగా ప్రభుత్వంపై పోరాడాలన్నారు. ఈ అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికల్లో రాజపేట, బాపనికుంట, శివలింగపురం, విఠలరావు నగర్, గాంధీ బొమ్మ సెంటర్, సెంటర్ ముదిరాజ్ సంఘం నాయకులు సభ్యులు ,తదితరులు పాల్గొన్నారు.