Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- టేకులపల్లి
ఇల్లందు కొత్తగూడెం ప్రధాన రహదారిలోని టేకులపల్లి పెట్రోల్ బంకు సమీపంలో ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢకొని స్పెషల్ ఏఆర్ కానిస్టేబుల్ మతి చెందిన సంఘటన. టేకులపల్లి ఎస్సై భుక్యా శ్రీనివాస్ కథనం ప్రకారం సుజాతనగర్ మండలంలోని సింగ భూపాలెం గ్రామానికి చెందిన మంచినీళ్లు నాగులు కుమా రుడు మంచినీళ్ళ రమేష్(33) 2001 బ్యాచ్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించినాడు. బోడు పోలీస్ స్టేషన్లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ మండలంలోని ముత్యా లంపాడు క్రాస్ రోడ్ లో బందోబస్తు నిమిత్తము విధులు నిర్వహించి తిరిగి బోడు పోలీస్ స్టేషన్ కు వెళ్తుండగా వైపు నుండి ఎదురుగా వస్తున్న స్కూటీ తన బైకును ఢ కొట్టడంతో తలకు బలమైన గాయాలు కావడంతో టేకులపల్లి పోలీస్ స్టేషన్ వాహనంలో చికిత్స నిమిత్తం కొత్తగూడెం వైద్యశాలకు తరలిస్తు ండగా మృతి చెందినట్లు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.