Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వాగతించిన సీపీఐ(ఎం)
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం పాత బస్టాండ్ నుండి సిటీ బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించటాన్ని సీపీఐ(ఎం) స్వాగతిస్తుందని పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. సామన్య ప్రజల కష్టాలు తీరటం, చిన్న వ్యాపారులకు మేలు జరగటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పాత బస్టాండ్‌ను లోకల్, జిల్లా బస్సుల కోసం కేటాయించి బస్సులు కొనసాగించాలని తమ పార్టీ అనేక ఆందోళనలు నిర్వహిం చిందని గుర్తు చేశారు. అధికారులు న్యాయమైన ప్రజల డిమాండ్‌ను పరిష్కరించకపోగా కేసులు పెట్టి నిర్భంధాలకు గురి చేశారని, అయినా చాలా కాలం ఆందోళన పోరాటాలు చేశామన్నారు. ఆచరణలో సీపీఐ(ఎం) చేసిన డిమాండ్ సరైందని గుర్తించినందుకు సంతోషంగా ఉందన్నారు. దీనిని సిటీ బస్సులకు మాత్రమే పరిమితం చేయకుండా పల్లె వెలుగు, జిల్లా సర్వీసులను నడిపితే ప్రజలకు, వ్యాపారులకు ఉపయోగం ఉంటుందని ఆయన అధికారులను కోరారు.