Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజు కూలి రూ.600 ఇవ్వాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ- సత్తుపల్లి
పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి కూలీలకు రోజుకు రూ.600 ఇవ్వాలని, యేడాదిలో 200 పనిదినాలు కల్పించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు సమావేశంలో పాండు రంగారావు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఈ పథకానికి భారీగా నిధులను తగ్గిస్తూ దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి కార్పొరేట్ సంస్థల ఎదుగుదలపై ఉన్నంత శ్రద్ధ పేదల జీవనస్థితిగతుల మెరుగుదలపై లేకుండా పోయిందని దుయ్యబట్టారు. సొంత స్థలాల్లో పేదల ఇండ్ల నిర్మాణాల కోసం రూ. 5లక్షలు ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
29-31 ఖమ్మం వ్యకాస మహాసభలను జయప్రదం చేయండి
ఈనెల 29 నుంచి 31 వరకు ఖమ్మంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని పాండురంగారావు వివిధ కార్మికులు, వ్యవసాయ కూలీలను కోరారు. 29న జరిగే బహిరంగ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి రావుల రాజబాబు, సీఐటీయూ మండల కన్వీనర్ కొలికపోగు సర్వేశ్వరరావు, నాయకులు మండూరు రవి, బాషా, వలీ, చావా రమేశ్, మోరంపూడి వెంకట్రావు, ఐద్వా నాయకురాళ్లు పాకలపాటి ఝాన్సీ, కుమారి పాల్గొన్నారు.