Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 29న పోడు రైతులు ఖమ్మం తరలి రావాలి
- సీపీఐ(ఎం) జిల్లా నాయకులు భూక్యా వీరభద్రం
నవతెలంగాణ-కొణిజర్ల
పోడు భూముల దరఖాస్తులు గ్రామసభ ఆమోదించిన వాటిని డివిజన్ లెవెల్, డిస్ట్రిక్ లెవెల్ కమిటీలు ఆమోదించి అందరికీ హక్కు పత్రాలు అందించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధిలో అన్నవరం, తుమ్మలపల్లి, తనికెళ్ల, అమ్మపాలెం, చిన్నగోపతి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోడు భూముల కోసం సుదీర్ఘమైన పోరాటాలు కమ్యూనిస్టులు చేస్తున్నారని, కమ్యూనిస్టులు బలపడితేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఇల్లు లేని పేదలందరికీ 5 లక్షల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. ఈనెల 29న జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడోవ మహసభ బహిరంగ సభకు రాజకీయాలకుతీతంగా ప్రజలు యువకులు నిరుద్యోగులు తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బొడ్డు వీరభద్రం, కొలుపుల సాంబయ్య, బాలాజీ లక్ష్మయ్య, సీతారాములు, బోయినపల్లి శ్రీనివాసరావు, లింగాల దానయ్య, బుర్రి గోపయ్య, బోలమల యోహాన్, సరోజిని తదితరులు పాల్గొన్నారు.