Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మంకార్పొరేషన్
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని షాదీఖానా ఫంక్షన్‌హాల్ నందు ఆదివారం పల్లా జాన్ రాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్రీయ కరాటే పోటీలు ఉర్దూఘర్లోని ఆడిటో రియంలో అట్టహాసంగా ప్రారంభమ య్యాయి. తొలుత పల్లా జాన్ రాములు కుమారుడు పల్లా రాజశేఖర్ తన తండ్రి అయిన పల్లా జాన్ రాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పల్లా జాన్ రాములు స్ఫూర్తితో ప్రతిఏటా కరాటే అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎమ్డీ గఫూర్ పల్లా జాన్ రాములు కుమారుడు పల్లా రాజశేఖర్ నేతృత్వంలో జరిగే అంతర్రాష్ట్రీయ కరాటే పోటీలు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నల్లమోతు తిరుమల రావు, మాజీ కార్పొరేటర్ సౌకత్ ఆలీ కలిసి జ్యోతి వెలిగించి అంతర్ రాష్ట్రీయ కరాటే పోటీలను ప్రారంభించారు.అనంతరం కరాటే అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుండి గఫూర్ అద్యక్షతన జరిగిన సభలో గ్రంథాలయం మాజీ చైర్మన్ యుండి ఖమర్ పోటీలకు హాజరైన పిల్లలకు ఆశీస్సులు అందజేశారు. ఆమాద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నల్లమోతు తిరుమల రావు మాట్లాడుతూ. కరాటే శారీరక దారుఢ్యాన్ని పెంచే మంచి క్రీడా అన్నారు. పల్లా రాజశేఖర్ మాట్లాడుతూ. జాన్ రాములు స్ఫూర్తి తో ప్రతీ ఏటా ఈ పోటీలు నిర్వ హిస్తున్నామని అన్నారు. వివిధ జిల్లాలో నుండి వచ్చిన పాఠశాల బాల, బాలికలు తమ కరాటే విన్యాసాలు వేదికపై ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల కరాటి మాస్టర్లు, తదితరులు పాల్గొన్నారు.