Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
పినపాక మండలం ఈ.బయ్యారం క్రాస్ రోడ్లో గల రాధిక ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు శుక్రవారం పాఠశాల కరస్పాండెంట్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ షాజమన్ మాట్లాడుతూ లోక రక్షకుడు క్రీస్తు యేసు చూపిన ప్రేమను పంచాలన్నారు. క్రిస్టమస్ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ఆనందోత్సవం నడుమ నృత్యాలు వేస్తూ ఎంతో చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. క్రిస్మస్ తాత ప్రత్యేక ఆకర్షణ నిలువగా, క్రీస్తు జననానికి సంబంధించిన పశువుల పాక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవిద్య కాలేజ్ ప్రిన్సిపల్ పాఠశాల ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు నిరోషా, హిమ విందు, ప్రవళిక, సుజాత, రజిని, బాలకృష్ణ, రవి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఎక్సెలెంట్ బాషా హై స్కూల్లో
బయ్యారం క్రాస్ రోడ్డులో గల ఎక్సెలెంట్ బాషా హై స్కూల్ నందు సెమీ సెమీ క్రిస్టమస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బండారు నరేంద్ర మాట్లాడారు. అనంతరం ప్రిన్సిపాల్ సురేష్ మాట్లాడుతూ బాల యేసు జన్మ వృత్తాంతమును, బాల యేసు గొప్పతనాన్ని వివరించారు. క్రైస్తవ, ఇతర మతస్తులందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సెలెంట్ గ్రూప్ అఫ్ చైర్మన్ ఎండీ యూసఫ్ షరీఫ్, డైరెక్టర్స్ ఎండీ ఖాదర్, ఎండీ యాకుబ్ షరీఫ్, ముక్కు నర్సారెడ్డి, బండారు నరేంద్ర, ప్రిన్సిపాల్ సురేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
జీవన్ జ్యోతి పాఠశాలలో సెమిక్రిస్మస్ వేడుకలు
ములకలపల్లి : ములకలపల్లిలోని జీవన్ జ్యోతి పాఠశాలలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శాంతాక్లాజ్, దేవదూతల వేషధారణలతో అలరిస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతరం సెమీ క్రిస్మస్ కేక్ కట్చేసి అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ జయంత్, సిస్టర్స్ నిర్మల, సుగంధి, రాజ్యం, దీప్తి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎక్స్లెంట్ పాఠశాలలో సెమిక్రిస్మస్ వేడుకలు
మణుగూరు : మండలంలోని పైలెట్ కాలనీలో గల ఎక్స్లెంట్ హై స్కూల్ పాఠశాలలో సెమి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్దులు ఉపాధ్యాయుల సహకారంతో పశువుల పాక, క్రిస్మస్ ట్రీను ఏర్పాటు చేసి వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం ఎక్స్లెంట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ ఎండి ఖాదర్ మాట్లాడారు. అనంతరం అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్లు యాకుబ్షరీఫ్, యూసఫ్ షరిఫ్, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సిద్దేల ఆధ్వర్యంలో
ప్రపంచ మానవాళి శ్రేయస్సుకు క్రీస్తు బోధనలు ఆదర్శనీయమని బీఆర్ఎస్ నేత, దళిత సంఘం రాష్ట్ర నాయకులు సిద్దెల తిరుమలరావు అన్నారు.శుక్రవారం బాపూజీ నగర్ లోని ఆయన స్వగృహంలో సెమీ క్రిస్టమస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండలంలోని పాస్టర్లు పాల్గొని మాట్లాడారు. జీటీఎస్ఎస్ఎస్ పాస్టర్ గిద్దె ఇసాక్, పాస్టర్ ఏంపల్లి ఇసాక్, పగిడిపల్లి జేమ్స్, రమణయ్య, నాగేశ్వరావు, రాజు తదితరులు పాల్గొన్నారు.