Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకర్ల సమావేశంలో టీడీపీ నాయుకులు
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఖమ్మం బహిరంగ సభ అనూహ్యామైన విజయవంతంగా జరిగిందని, సభకు తరలివచ్చిన ప్రజానీకాన్ని చూసి టిఆర్ఎస్ రేణుల్లో వణుకు పుడుతుందని, అనవసరపు ప్రేలాపనలు చేస్తున్నారని, మంత్రులు ఉలిక్కి పడుతున్నారని టిడిపి కొత్తగూడెం ఇన్చార్జీ, రాష్ట్ర రైతు సంఘం నాయకులు కాపా కృష్ణమోహన్, కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ కనుకుంట్ల కుమార్లు అన్నారు. శుక్రవారం బూడిదగడ్డలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 21వ తేదీన ఖమ్మంలో జరిగిన చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వెల్లి విరిసిందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసేందుకు సిద్ధం అవుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంద్రప్రదేశ్లో చేసిన అభివృద్దే ఈనాడు కనిపిస్తుందని, 8 ఏండ్ల కాలంలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ఏమి చేసిందని ప్రశ్నించారు. ఈ విలేకర్ల సమావేశంలో తెలుగుదేశం నాయకులు కళ్యాణం లక్ష్మీపతి, బివి.రమణారావు, మన్నెపల్లి కోటయ్య, మోహనచారీ, ఎండి.సర్వర్పాష తదితరులు పాల్గొన్నారు.