Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిధిలోని నర్సాపురం సూదిరెడ్డి నాగిరెడ్డి ఆదిలక్ష్మమమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో శుక్రవారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆర్లగూడెం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఆయుర్వేద వైద్యాదికారి ఉషారాణి, నర్సాపురం నేచురోపతి వైద్యురాలు జ్యోతిలు 139 మంది విద్యార్దులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన విద్యార్ధులకు మందులు అందజేశారు. ఈ సందర్బంగా విద్యార్దులకు ఆయుర్వేదం పై అవగాహన కల్పించారు. ఈ వైద్య శిభిరంలో ప్రదానోపాద్యాయులు కె.వి.కాంతారావు, పారా మెడికల్ సిబ్బంది కందుల వీరభద్రం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.