Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని రవీంద్రభారతిలో గణితశాస్త్ర దినోత్సవం సందర్భంగా శ్రీనివాస రామానుజన్ జయంతి పురస్కరించుకొని ఎస్ఆర్ఎఫ్ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఒలింపియాడ్ పోటీ పరీక్షలలో రాష్ట్ర, జిల్లా స్థాయి ర్యాంక్‌లు సాధించిన సుమారు 60శాతం విద్యార్థినీ, విద్యార్థులకు ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒలంపియాడ్ విజేతలకు అవార్డులు అందజేశారు. బూర్గంపాడులో గల బాలికల గురుకుల పాఠశాలకు చెందిన కొనకాంచి భవిత్య వర్షిణి 10వ తరగతి విద్యార్థినీ స్టేట్ టాపర్‌గా నిలిచింది. అలాగే కొనకంచి సాయి వర్షిత, దారావత్ పార్వతిలు జిల్లా టాపర్లుగా నిలిచి అవా ర్డులు అందుకున్నారు. అవార్డులు అందుకున్న విద్యార్థినిలకు పాఠశాల ప్రిన్సిb ాల్ అనిత, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో అవార్డులు సాధించిన విద్యార్థినిలను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.